సినిమా పరిశ్రమలో ఎవరికైనా ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఉంటుంది. తప్పకుండా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయాలని ప్రతి ఒక్క టెక్నీషియన్ నటుడు అనుకుంటారు. అలా ఇప్పటివరకు ఎన్నో ఆస్కార్ అవార్డులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కళాకారులు ఈ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అయితే ఆస్కార్ అవార్డ్ తెలుగు సినిమా కి ఎప్పుడు మోక్షం చూపిస్తుందో తెలియదు కానీ ఈసారి కూడా తెలుగు సినిమాలలో ఏ సినిమా ఆస్కార్ అవార్డ్  నామినేషన్ల లలో రాకపోవడం అందరినీ ఎప్పటిలాగే ఎంతో నిరాశ పరుస్తుంది. 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా తప్పకుండా ఆస్కార్ అవార్డు ను తెప్పించి భారత దేశం గర్వపడేలా చేస్తుందని అనుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలవగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా దక్కించుకోవడంతో తప్పకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కుతుందని ప్రతి ఒక్క భారతీయుడు భావించాడు. కానీ ఆ సినిమాను నామినేషన్స్ లో కూడా కనీసంగా పట్టించుకోకపోవడం అందరినీ ఒక్క సారిగా ఆశ్చర్యపరిచింది. 

గల్లీ క్రికెట్ లో సిక్స్ కొట్టి సచిన్ లా ఫీల్ అయిపోతున్నారు అనే అపవాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి పై ఉంది. అయితే తాజాగా 94 వ ఆస్కార్ అవార్డుల బరిలోకి మన దేశానికి చెందిన కొన్ని సినిమాలను షార్ట్ లిస్ట్ చేశారు. అలా అనేక భాషల నుండి మంచి మంచి సినిమాలు ఎంపిక చేయగా తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు నామినేషన్ లోకి కూడా వెళ్లలేదు. ఈనాటికీ ఆస్కార్ అందని ద్రాక్ష లాగే మిగిలిపోయింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఆస్కార్ అవార్డు ఎప్పుడు వరిస్తుందో చూడాలి. మరి భవిష్యత్తులో అయిన ఈ కోరిక తీరుతుందా అనేది చూడాలి. ఎక్కువ తెలుగు సినిమాలు రీమేక్ అయ్యే టాలీవుడ్ సినిమా కు ఆస్కార్ ఎప్పుడు అందుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: