ఈవారం విడుదల అయిన చిన్న సినిమాలలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ విజేతగా నిలిచింది. ఈ సినిమాతో కొంతవరకు హిట్ ట్రాక్ పైకి విశ్వక్ సేన్ వచ్చినప్పటికీ కేవలం మరో 5రోజులలో విడుదల కాబోతున్న ‘సర్కారు వారి పాట’ మ్యానియా ముందు ఈ మూవీ కలక్షన్స్ పరంగా ఎంతవరకు నిలబడుతుంది అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి.



మూవీ కలక్షన్స్ విషయం పక్కకు పెడితే ఈమూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న చిన్న మీడియం రేంజ్ సినిమాల హీరోయిన్స్ సమస్య ఈమూవీతో తీరింది అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ చేస్తున్నారు. ఈసినిమా పబ్లిసిటీలో ఎక్కువగా హీరోయిన్ రుస్కర్ ధిల్లాన్ కనిపించడంతో ఈమూవీకి కీలకపాత్ర ఆమె అనుకున్నారు అంతా.



అయితే ఈసినిమా విడుదల అయిన తరువాత ఈ మూవీలో నటించిన సెకండ్ హీరోయిన్ గురించి చాలమంది ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఆ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి ఆమె మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె పేరు రుతిక నాయక్ ఆమెకు సుమారు 25 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈమూవీ చూసిన వారికి ఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే అనుకుంటారు. ఈమూవీలో ఆమె తన అద్భుతమైన నటనను ప్రదర్శించింది.



దీనితో చిన్నమీడియం రేంజ్ సినిమాల హీరోయిన్స్ సమస్యకు రుతిక పరిష్కారం చూపెడుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈమూవీని దర్శకుడు మనసుపెట్టి తీసినప్పటికీ ఎంతో అద్భుతం అని సగటు ప్రేక్షకుడు అనుకున్నప్పుడు మాత్రమే ధియేటర్లకు జనం వస్తున్నారు. చిన్న సినిమాలు బాగున్నాయి అని టాక్ వచ్చినా వాటిని నెల రోజులు గడిచిన తరువాత ఓటీటీ లో లేదంటే టివి ఛానల్స్ లో ఆసినిమాలను ఫ్రీగా చూడవచ్చు అన్న అభిప్రాయంలో చాలామంది ఉంటున్నారు. దీనితో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ మ్యానియా ముందు ఈ మూవీ ఎంతవరకు నిలబడుతుంది అన్న సందేహాలు ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: