విశ్వకథానాయకుడు కమలహాసన్ సినిమాల మార్కెట్ ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదు. ఒకప్పుడు రజినీకాంత్ తో సరిసమానంగా తమిళ ఫిలిం ఇండస్ట్రీని శాసించిన కమలహాసన్ సినిమాలలో మాత్రమే కాదు రాజకీయాలలోనూ ఏమాత్రం రాణించలేకపోయాడు. దీనితో కమలహాసన్ పని అయిపోయింది అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికి తన సర్వశక్తులు ధారపోసి సుమారు 200 కోట్ల బడ్జెట్ తో తన సొంత బ్యానర్ పై తీసిన విక్రమ్ మూవీ పై కమల్ చాల ఆశలు పెట్టుకున్నాడు.


తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ మూవీతో తనకు తిరిగి పూర్వ వైభవం వస్తుందని కమలహాసన్ ఆశిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు తమిళ మళయాళ కన్నడ హిందీ భాషలలో జూన్ 3న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మూవీకి పోటీగా రెండు భారీ అంచనాలు ఉన్న సినిమాలు విడుదల అవుతూ ఉండటంతో కమల్ గట్టిపోటీని ఎదుర్కుంటున్నాడు.


అడవి శేషు నటించిన ‘మేజర్’ మూవీ కూడ జూన్ 3న విడుదల కాబోతోంది. ఈ మూవీ పై కూడ అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ నగరాలలో ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలకు చాలామంచి స్పందన వస్తోంది. ఇక జూన్ 3న అక్షయ్ కుమార్ నటించిన ‘పృధ్వీరాజ్’ మూవీ విడుదల కాబోతోంది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ చారిత్రాత్మిక మూవీ పై కూడ చాల అంచనాలు ఉన్నాయి.


ఈ సినిమాను కూడ హిందీతో పాటు దక్షిణాది భాషలలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ మీడియా ఈ మూవీ ‘బాహుబలి’ ‘పద్మావతి’ స్థాయిలో విజయవంతం అవుతుందని ఊహాగానాలు చేస్తోంది. ఇంత తీవ్రమైన పోటీ మధ్య కమలహాసన్ వెనుకడుగు వేయకుండా తన విక్రమ్ ను రంగంలోకి దింపుతున్నాడు. దీనితో ఈ ప్రముఖ పోటీలో ఎవరు విజేత అన్న విషయమై అనేక ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: