కోవిడ్ వేవ్ ల తరువాత దక్షిణాది సినిమారంగం బాగాకోలుకుని తమ సినిమాలకు రికార్డు కలక్షన్స్ రప్పించుకుంటున్నప్పటికీ ఈవిషయంలో ఉత్తరాది సినిమాలు మాత్రం బాగా వెనకపడుతున్నాయి. లేటెస్ట్ గా భారీ అంచనాలతో విడుదలైన అక్షయ్ కుమార్ ‘పృధ్వీరాజ్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ బెంబేలు పడిపోతోంది.


దక్షిణాది సినిమాలు అయిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీ ఎఫ్ 2’లకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో దక్షిణాది సినిమాల దాటీకి బాలీవుడ్ సినిమాలు షేక్ అవుతున్నాయి అన్నకామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ ఇండస్ట్రీ ఆశలుఅన్నీ ‘బ్రహ్మాస్త్ర’ మూవీ పైనే ఉన్నాయి. సెప్టెంబర్ లో విడుదలకాబోతున్న ఈమూవీ ప్రమోషన్ మూడు నెలలు ముందే ప్రారంభించి రికార్డులు క్రియేట్ చేయాలని ఈమూవీ యూనిట్ చాల గట్టిప్రయత్నాలు చేస్తోంది.




‘ఏ జవాని హై దివాని' లాంటి బ్లాక్ బష్టర్ తీసిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈమూవీలో రణబీర్ కపూర్ అమితాబ్ బచ్చన్ ఆలియా భట్ నాగార్జున లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తూ ఉండటంతో పాటు ఈమూవీకి రాజమౌళి సపోర్ట్ కూడ లభించడంతో ఈమూవీ మన దక్షిణాదిలో కూడ సంచలనాలు చేస్తుందని ఆశపడుతున్నారు. తారాగణం కలిసి చేసిన సినిమా ఇది. ఇది కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందని చిత్ర బృందంతో పాటు బాలీవుడ్ జనాలు ఆశిస్తున్నారు.


దీనికితోడు ఈమూవీ ట్రైలర్ కు వచ్చిన అనూహ్య స్పందన కూడ ఈమూవీ పై అంచనాలు పెంచుతోంది. ముప్పులో పడ్డ మానవజాతిని రక్షించడానికి శివుడి అంశ తో పుట్టిన ఒక యువకుడు బ్రహ్మాస్త్రాన్ని చేతబూని దుష్టశక్తులతో పోరాడి విజయం సాధించిన కథ ఇది. అయితే ఆ బ్రహ్మాస్త్రన్ని ఆయువకుడి నుండి వంచించి తీసుకోవడానికి అనేకమంది విలన్స్ దుష్టశక్తులుగా ప్రయత్నాలు చేసే కథ ఇది. అయితే ఇలాంటి కథతో చాలాకాలం క్రితం చిరంజీవి ‘అంజి’ వెంకటేష్ ‘దేవీపుత్రుడు. సినిమాలు వచ్చాయి. అయితే ఆ రెండు సినిమాలు భారీ ఫ్లాప్స్ ఇప్పుడు అలాంటి నెగిటివ్ సెంటిమెంట్ ‘బ్రహ్మాస్త్ర’ మూవీని కూడ వెంటాడుతుందా అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ ఈ మూవీని దక్షిణాదిలో విడుదల చేస్తున్న రాజమౌళికి టెన్షన్ పెడతై అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: