డైరెక్టర్ రాంగోపాల్ వర్మ శిష్యులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది డైరెక్టర్లు పరిచయమయ్యారు అలాంటి వారిలో అజయ్ భూపతి కూడా ఒకరు. ఇక తన గురువు వర్మ తరహాలోనే పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు అలా మొదటి ప్రయత్నం..RX -100 సినిమాని తెరకెక్కించారు ఈ సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నారు అజయ్ భూపతి. తదుపరి సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించారు కానీ ఈ సినిమా ఫలితం చాలా ఘోరంగా మారింది. ఇక మహాసముద్రం సినిమా ఫలితం కారణంగా చాలామంది నిర్మాతలు ఈయనతో సినిమా చేయడానికి ఎక్కువ మక్కువ చూపలేదు. దీంతో ఆఫర్ల కోసం ఈయన చాలా దూరం వెళ్ళాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం..


తనకు బాలీవుడ్ లో ఉన్న పరిచయాలతో ముంబైలో ప్రముఖ డైరెక్టర్ రాజకుమార్ హిరని ని కలిసి ఆయనతో తన వద్ద ఉన్న ఐడియాలను షేర్ చేసుకున్నారు ఇంతకుముందు సినిమాలు యొక్క పనిని మరియు తాజా ఐడియాస్ తో ఆయనను ఇంప్రెస్ చేశారు. దీంతో  కలిసి వర్క్ చేద్దామని అంటూ అజయ్ భూపతి కి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అజయ్ భూపతి రెడీ చేసిన రెండు కథలు బాలీవుడ్ డైరెక్టర్ కి బాగా నచ్చాయట.

ఇక అజయ్ భూపతి చేయబోతున్న ఆ హిందీ సినిమాలు తెలుగులో కూడా ఒకే సమయంలో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా అంటే చాలు బాలీవుడ్లో మంచి క్రేజీ ఉంది అందుచేతనే ఆయనతో అజయ్ భూపతి సినిమా అంటే కచ్చితంగా అక్కడ మంచి హైట్ క్రియేట్ చేస్తుందని ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు. మొత్తానికి మహాసముద్రం సినిమా ఎఫెక్ట్తో డీలపడకుందు బాలీవుడ్ వైపు అవకాశం కోసం వెళ్ళినా అజయ్ భూపతి సక్సెస్ అవుతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: