తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ హీరో గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ లో కుష్బూ , జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 4 రోజుల్లో ఈ సినిమా నైజాం ఏరియాలో 1.1 కోట్లు , సీడెడ్ లో 49 లక్షలు , యూఏ లో 39 లక్షలు , ఈస్ట్ లో 28 లక్షలు , వేస్ట్ లో 16 లక్షలు , గుంటూరు లో 22 లక్షలు , కృష్ణ లో 24 లక్షలు , నెల్లూరు లో 13 లక్షలు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని 17 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో 3.09 కోట్ల షేర్ ...  6.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 14.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 15.20 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది. ఈ మూవీ మరో 12.11 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: