
పైన ఫోటోలో సూపర్ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అలాగే టాలీవుడ్ కు చెందిన ఓ టాప్ డైరెక్టర్ కు ఆమె మోస్ట్ లక్కీ బ్యూటీ. ఆమె లేకుండా సదరు డైరెక్టర్ సినిమానే చేయడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలోనూ ఆమె నటించింది.. ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా? ఆ చిన్నారి మరెవరో కాదు.. మాళవిక నాయర్.
ఢిల్లీలోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన ఈ వయ్యారి.. చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ చేసింది. వివిధ ప్రకటనల్లో మెరిసింది. 13 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. కెరీర్ ఆరంభంలో చిన్న చితక పాత్రలు అందుకున్న మాళవిక నాయర్.. 2013లో విడుదలైన మలయాళ డ్రామా ` బ్లాక్ బటర్‌ఫ్లై` తో హీరోయిన్ గా మారింది. ఈ సినిమాకు ఆమె గుర్తింపుతో పాటు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. అలా 2014లో తమిళ చిత్రం `కుకూ ` లో అంధురాలుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న మాళవిక.. ` ఎవరే సుబ్రమణ్యం`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డెబ్యూ మూవీ ఇది. ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి, కల్కి 2898 ఏడీ చిత్రాల్లోనూ ఆమె మెరిసింది. అలాగే మరోవైపు కళ్యాణ వైభోగమే, టాక్సీవాలా, ఒరేయ్ బుజ్జిగా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, అన్నీ మంచి సకునములే తదితర తెలుగు చిత్రాల్లో నటించింది. వాటిలో మెజారిటీ సినిమాలు కమర్షియల్‌గా హిట్ కానప్పటికీ.. మాళవిక తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులకు చేరువైంది. భారీగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం మాళవిక నాయర్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ తో ఓ సినిమా చేస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
