సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ సినిమా సెట్స్ మీద ఉంది. హారిక హాసిని బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో పూజా హెగ్దే, శ్రీ లీల ఇద్దరు కథనాయికలుగా నటిస్తున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అసలైతే ఈ సమ్మర్ రిలీజ్ అనుకున్నా అది కాస్త వాయిదా పడింది. అయితే ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏకంగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వాయిదా పడింది. జనవరి 13 2024 న మహేష్ 28వ సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.

అయితే ఈమధ్య త్రివిక్రం తన సినిమానే కాకుండా పవన్ రీమేక్ చేస్తున్న సినిమా కొసం కూడా పనిచేస్తున్నారట. అందుకే మహేష్ 28వ సినిమాకు తగిన టైం కేటాయించలేకపోతున్నారని అంటున్నారు. ఇలానే కొనసాగితే మహేష్ త్రివిక్రం సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవడం కూడా కష్టమే అని తెలుస్తుంది. మహేష్ లేట్ అయినా హిట్ టార్గెట్ తో సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి త్రివిక్రం ని కూడా అంతగా తొందర పెట్టలేదని తెలుస్తుంది.

సో చూస్తుంటే మహేష్ 28 పొంగల్ రేసు నుంచి కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ శ్రీ లీల మధ్య వచ్చే సీన్స్ స్పెషల్ గా ఉండబోతాయని టాక్. మహేష్ శ్రీ లీల బావా మరదళ్లుగా సీన్స్ అన్ని చాలా రొమాంటిక్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇక థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ అవుతుందని అంటున్నారు. త్రివిక్రం ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా టైటిల్ విషయంలో కన్ ఫ్యూజన్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజు క్లారిటీ వస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: