తమిళ నటుడు సూర్య కొంత కాలం క్రితం కంగువా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి భారీ ఫ్లాప్ ను అందుకున్నాడు. కంగువా లాంటి భారీ అపజయం తర్వాత సూర్య తాజాగా రేట్రో అనే సినిమాలో హీరోగా నటించాడు. పూజ హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటించగా ... కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో 35.70 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.90 కోట్లు , కర్ణాటక ఏరియాలో 9.10 కోట్లు , కేరళలో 3.80 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.10 కోట్లు , ఓవర్సీస్ లో 17.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి నాలుగు రోజుల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 36.45 కోట్ల షేర్ ... 72.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకోవాలి అంటే మరో 45.5 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయవలసి ఉంది. మరి ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: