
ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామని చెప్పినా కూడా చాలామంది ముందుకు రాలేదని వివరించారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ వల్ల అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఉండటం వల్ల... ప్రజా ప్రతినిధులు అలాగే ప్రజల మధ్య బంధం తెగిపోయింది అని కూడా క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఇది ఇలా ఉండగా మొన్నటి ఎన్నికల్లో... గుడివాడ అమర్నాథ్ కూడా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ పని చేశారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 150 కి పైగా సీట్లు సాధించిన వైసీపీ పార్టీ... మొన్నటి కూటమి దెబ్బకు 11 స్థానాలకు పరిమితమైంది. వైసీపీ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న చాలామంది బడా లీడర్లందరూ కూటమి వైపు వెళ్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు