
నందమూరి నటసింహం ఇప్పుడు వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్లతో దూసుకు పోతున్నాడు. తాజాగా పద్మ అవార్డు రావడంతో బాలయ్య కంచుకోట అయిన హిందూపురం లో ఆయన అభిమానులు ఓ భారీ బహిరంగ సభ పెట్టి ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఇక బాలయ్య సంక్రాంతికి డాకూ మహారాజ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుసగా నాలుగో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తాను వరుసగా నాలుగు హిట్లతో దూసుకు పోతున్నానని.. వచ్చే అఖండ 2 - తాండవం సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇక బాలయ్య ప్రస్తుతం నటించే అఖండ 2 తాండవం సినిమా ను ఈ యేడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
ఇక బాలయ్య 112వ సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చేసింది. బాలయ్య 112 వ సినిమా ను ఆర్కా మీడియా వాళ్లు నిర్మిస్తారట. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. గతంలో బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమా లు కథా నాయకుడు ... మహా నాయకుడు రెండు సినిమాలను కూడా క్రిష్ డైరెక్ట్ చేసినా అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఆ రెండు సినిమాలు సరిగా ఆడలేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు