
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమాలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా. ఈ SSMB 29 కోసం యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసి కొన్ని షెడ్యూల్స్ కూడా దర్శకుడు రాజమౌళి పినిష్ చేసేశారు. అయితే రాజమౌళి గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కోసం తన రూటు పూర్తిగా మార్చేసుకున్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
రాజమౌళి తన గత సినిమాలను అధికారికంగా ప్రకటించుకున్నారు. ఏదో ఒక అప్ డేట్ వదులుతూ ఉండేవారు. అయితే మహేష్ బాబు సినిమా ను ఆయన ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించనూ లేదు .. అలాగే ఏ అప్ డేట్ కూడా బయటకు రానివ్వడం లేదు. చాలా జాగ్రత్తగా .. సీక్రెట్ గా షూట్ చేసేస్తున్నాడు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ఈ సినిమా నుంచి పూర్తయినా .. ఏ అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ ఉండాలంటే నిత్యం మీడియాలో ఈ సినిమా గురించి చర్చ జరిగేలా ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాలని.. అప్పుడే ఫ్యాన్స్ లో జోష్ ఉంటుందని అంటున్నారు. మరి జక్కన్న ఈ సినిమా విషయంలో ఇప్పటకి అయినా మౌనం వీడతాడు ఏమో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు