ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ మరియు కృతి సనన్ కలిసి నటించిన సినిమా ఆదిపురుష్. ఎన్నో నెగటివ్ కామెంట్స్ ని విమర్శలను ఎదుర్కొన్న తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 16న విడుదల కావడానికి రెడీ అయింది..

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ కంటే ముందు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర మరియు మధు మంతెనలతో కలిసి మరోసారి రామాయణ గాథను భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో తెరకెక్కించబోతున్నట్టు అయితే

ఈ చిత్రానికి దంగల్ ఫేం నితీశ్ తివారీ మామ్ ఫేం రవి ఉద్యవార్లు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తుంది.. మొదటి భాగాన్ని 2021లో విడుదల చేయనున్నట్టు అప్పట్లో అయితే ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రంలో రాముడు, రావాణాసురుడిగా ఎన్టీఆర్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ మరియు మహేష్ బాబు స్టార్ నటుల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత ఈ చిత్రంపై ఎలాంటి ప్రకటన అయితే లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం అల్లు అరవింద్ త్రి విక్రమ్ తో మాటలు రాయించారట. ఇప్పటికే లాక్డౌన్లో రామాయణం సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ను త్రివిక్రమ్ పూర్తి చేసినట్టు కూడా సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ హీరోల కలయికలో భారీ మల్టీస్టారర్గా తెరకెక్కించబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ను శ్రీరాముడి పాత్ర కోసం, సీతగా ఆమె ధర్మపత్ని ఆలియా పేరును ఫైనలైజ్ చేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరోవైపు కేజీఎఫ్ ఫేమ్ యశ్ లంకాధిపతి అయిన రావణాసురుడిగా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు కూడా సమాచారం. ఈ రామాయణలో హిందీ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తే  కన్నడ సౌత్ ఇండస్ట్రీకి చెందిన యశ్ రావణాసురుడిగా యాక్ట్ చేయడం గమనార్హం.. మొత్తంగా సౌత్, నార్త్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ పై అపుడే అంచనాలు కూడా మొదలయ్యాయి. దాదాపు రామయణంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా ఫైనలైజ్ అయినట్టు కూడా సమాచారం. ఇక రామాయణం లాంటి గాథకు ఎలాంటి పేటెంట్ హక్కులు అయితే లేవు. ఎవరైనా తెరకెక్కించవచ్చు. పౌరాణిక, చారిత్రక కథలకు కాపీ రైట్ హక్కులు లాంటివి ఉండవు కాబట్టి ఎవరైనా ఈ కథతో సినిమాను తెరకెక్కించవచ్చని తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: