కరోనా పరిస్థితులతో వ్యాపారాలు పరిశ్రమలు మందగించడంతో అనేకమంది నిరాశకు లోనవుతున్నారు. చాలామంది తమ వ్యాపారాలను ఎలా కాపాడుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేశంలో ప్రస్తుతం ప్రభలుతున్న కరోనా మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలలో ఊహించని ఒక మార్పును తీసుకు వచ్చింది అంటూ ఒక సర్వే షాకింగ్ విషయాలను తన అధ్యయనంలో తెలియచేసింది.

బియాన్ అండ్ కో ఏడబ్ల్యూఈ గూగుల్ సంస్థతో కలిసి ఈ కరోనా పరిస్థితుల మధ్య చేసిన సర్వేలో మహిళా పారిశ్రామిక వేత్తలలో సుమారు 73 శాతం మంది తమ వ్యాపారాలను పరిశ్రమలను కాపాడుకుని గట్టెక్కగలమని చెపితే కేవలం 50 శాతం మంది పురుష పారిశ్రామిక వేత్తలు మాత్రమే తమ వ్యాపారాల విషయమై ధైర్యంగా ఉన్నారని ఈ సర్వే తెలియచేసింది. అంతేకాదు అనేకమంది మహిళా పారిశ్రామిక వేత్తలు మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ ఆమోచనలు వ్యూహాలు మార్చుకుంటూ డిజిటల్ టెక్నాలజీ ద్వారా తమ వస్తువుల సరఫరా కొనుగోలు అమ్మకాలు చేస్తూ చాల ధైర్యంగా ముందడుగు వేస్తున్నారని ఈ నివేదిక తెలియ చేస్తోంది.

ముఖ్యంగా భారత్ లో మహిళల యాజమాన్యంలో నడుస్తున్న సుమారు 1.6 కోట్ల వ్యాపార సంస్థలు ప్రస్తుత వ్యతిరేక పరిస్థితులను తట్టుకుని నిలబడటమే కాకుండా వారి వ్యాపారాలను మరింత ముందుకు తీసుకు వెళ్ళే విధంగా కొనసాగిస్తున్నారని ఇలాంటి మహిళా చైతన్యం అభివృద్ధి చెందిన దేశాలలో కూడ కనిపించడం లేదు అంటూ ఆ నివేదిక అభిప్రాయ పడింది. ఈ నివేదిక వెల్లడించిన విషయాలను పరిగణలోకి తీసుకుంటే సుమారు 73 శాతం మంది మహిళా వ్యాపారులు తమ వ్యాపారాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి అన్న భావన రానీయకుండా తమ వ్యాపారాలకు సంబంధించిన కొత్త ఉత్పత్తులు వినూత్న సేవలు అందించే దిశగా అడుగులు వేయడమే కాకుండా ఈ కరోనా పరిస్థితులలో పురుషుల ఆరోగ్యం కంటే మహిళల శారీరక ఆరోగ్యం చాల బాగుంది అంటూ తెలుపుతున్న ఈ సర్వే వివరాలు మహిళల చైతన్యాన్ని సూచిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: