మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందంటే మెగా ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో కూడా ఓ ప్రత్యేకమైన క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అందులోనూ మెగాస్టార్ తన కమ్ బ్యాక్ మూవీస్ తో రఫ్ ఆడించేస్తున్నాడు. ఈ జనరేషన్ హీరోలే తిప్పలు పడుతున్న 100కోట్ల క్లబ్ లోకి తన రెండు సినిమాలను అవలీలగా దాటించేసిన చిరంజీవి టాలీవుడ్ కి తానే ఎప్పటికీ నెంబర్ వన్ హీరోనని నిరూపిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న తన 152వ మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

 

 

దేవాలయాల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా స్కోప్ ఉందట. దీంతో ఓ పవర్ ఫుల్ విలన్ ను ఈ పాత్రకు ఎంపిక చేయాలని సినిమా యూనిట్ భావిస్తోందట. దీంతో దర్శకుడు కొరటాల శివ ఈ పాత్రకు విలక్షణ నటుడు మోహన్ బాబు పేరును చిరంజీవికి సూచించినట్టు తెలుస్తోంది. ఇలాంటి పాత్రకు రెగ్యులర్ విలన్లను కాకుండా చిరంజీవికి సరిజోడులా ఉండే మోహన్ బాబు అయితే కరెక్ట్ గా ఉంటుందని కొరటాల అభిప్రాయంగా ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే.. ఈ పాత్రకు మోహన్ బాబు ఒప్పుకుంటాడా.. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అఫిషియల్ న్యూస్ రావాల్సిందే.

 

 

80వ దశకంలో చిరంజీవిమోహన్ బాబు అనేక సినిమాల్లో నటించారు. హీరోలుగా కలిసి చాలా సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన అనేక సినిమాల్లో మోహన్ బాబు విలన్ మెప్పించారు. మోహన్ బాబు హీరో అయ్యాక వీరిద్దరూ కలిసి నటించింది లేదు. వీరిద్దరూ కలిసి తెరపై కలిసి నటించిన ఆఖరు సినిమా కొదమసింహం. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తే సెన్సేషనే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: