రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపిస్తుంటే, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. దాదాపు పదిభాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన విడుదల అవుతుందని ప్రకటించారు.

 

అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి సంవత్సరం కావొస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కనీసం సినిమా పేరునైనా ప్రకటించలేదు. ఆర్.ఆర్.ఆర్ అభిమానులు హీరోలుగా నటించే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల లుక్ విడుదల చేయాలని సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపిస్తున్నా ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ప్రతీ పండక్కి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని ఎదురుచూసి చూసి చివరికి ఏమీ రాకపోయేసరికి నిరుత్సాహ పడిపోతున్నారు.

 

అయితే ఈ నెలలో ఆర్.ఆర్.ఆర్ నుండి పెద్ద సర్పైజ్ రానుంది. మార్చ్ 27 వతేదీన రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు లుక్ ని విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఈసారైనా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

 

మరి అభిమానుల కోరిక నెరవేరుతుందా లేదా చూడాలి. ఇక ఆర్.ఆర్.ఆర్ ని v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య 350కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా నిర్మిస్తుండగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: