భారతీయ సినిమాలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీదేవి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దాదాపు అన్ని భాషల్లో అందరు అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసింది. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సరే శ్రీదేవి రేంజ్ వేరు. మన తెలుగులో ఆమె చేయని హీరో లేరు. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె ఆడిపాడింది. ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు ఇలా అందరి పక్కన ఆమె నటించింది. ఒక్కో హీరోతో ఆమె దాదాపు నాలుగు అయిదు సినిమాలు చేస్తూ ఉండేది. అగ్ర హీరోలు ఎక్కువగా ఆమెతో సినిమాలు చేసే వాళ్ళు. 

 

ముఖ్యంగా ఎన్టీఆర్, శోభన్ బాబు తో ఆమె దాదాపు 20 సినిమాల్లో చేసింది, ఎన్టీఆర్ తో ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా రికార్డులు తిరగరాసిన సినిమాలే. కొండవీటి సింహం, గజ దొంగ, బొబ్బిలిపులి, జస్టీస్ చౌదరి సినిమాలు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపాయి. అనురాగ దేవత సినిమాతో శ్రీదేవి అగ్ర నటి అయిపోయింది. ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు కూడా అప్పటి నుంచే రావడం మొదలయింది. అగ్గిరవ్వ అనే సినిమాలో శ్రీదేవి నటనకు ఫిదా అయిపోయారు. ఆటగాడు సినిమాలో శ్రీదేవి ఎన్టీఆర్ జోడీ కి మంచి మార్కులు పడ్డాయి. 

 

సర్దార్ పాపారాయుడు సినిమా శ్రీదేవి కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా. సత్యం శివం సినిమా కూడా బాగా ఆడింది. సింహం నవ్వింది సినిమా పర్వాలేదనిపించింది. ఇలా దాదాపు ఎన్టీఆర్ తో ఆమె 10 సినిమాలు చేసింది. అన్ని కూడా మంచి విజయాలు సాధించడం తో శ్రీదేవి ఎన్టీఆర్ జోడీ కి ప్రత్యేకంగా అభిమానులు ఉండే వారు అప్పట్లో. ఆ విధంగా ఈ జోడి తమదైన ముద్ర వేసుకుంది టాలీవుడ్ లో. ఇక వీరి కోసం అగ్ర దర్శకులు ప్రత్యేక సీన్లు రాసుకునే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: