సురేఖావాణి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై ఎన్నో చిత్రాల్లో న‌టించింది. అక్క‌గా, వ‌దిన‌గా, మ‌రి కొన్ని చిత్రాల్లో అమ్మ‌గా ఇలా ఎన్నో పాత్ర‌ల్లో ఎన్నో కాంబినేష‌న్ల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది.  బ్ర‌హ్మానందం, న‌రేష్‌, ఇలా ఎంతో మందితో కాంబినేష‌న్ల‌లో న‌టించి మెప్పించింది. అయితే ఈమె ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తెర మీద క‌నిపించే పాత్ర‌ల‌కి పూర్తిగా వ్య‌తిరేకంగా ఆమె ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. 

 

దీనికి  నెటిజ‌న్లు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే ఆమె లైఫ్‌ని ఆమెకు న‌చ్చిన‌ట్లు జీవిస్తుంద‌ని కొంద‌రు అంటుంటే ఈ ఆంటీ మ‌రీ హీటెక్కిస్తుంద‌ని ఇంకొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా సెల‌బ్రెటీలు ఏమి చేసిన కూడా అదొక వింత‌లా చూడ‌టం మ‌న‌వాళ్ళ‌కి బాగా అల‌వాటైపోయింది. ఇక ఇటీవ‌లె భ‌ర్త‌ను పోగొట్టుకున్న ఆమె సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌తో వేడెక్కించేస్తోంది. ఇక త‌న కూతురుతో దిగిన కొన్ని హాట్ ఫొటోల‌ను షేర్ చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యోక్తుల‌ను చేసింది. 

 

ఇక ఇదిలా ఉంటే త‌న కూతురుతో క‌లిసి దిగిన హాట్ ఫొటోల‌కి వ‌చ్చిన కామెంట్లు ఏమిటంటే...కూతుర్ని పెంచేది ఇలా కాదంటూ కొంత మంది నెటిజ‌న్లు ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు. దానికి ఆమె వెంట‌నే ఆ నెటిజ‌న్‌కి ఎదురు కౌంట‌ర్ ఇచ్చింది. నీలాంటి వీధి కుక్క‌లు లైఫ్ ని చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ మైండ్ సెట్ కి హ్యాట్సాఫ్ అని సురేఖ వాణి నెటిజన్ కి  దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మ‌రికొంత మంది సురేఖ‌వాణిని స‌పోర్ట్ చేస్తూ ఆమె త‌న లైఫ్‌ని త‌న‌కు న‌చ్చిన‌ట్లు లీడ్ చేస్తోంద‌ని అంటున్నారు. అయితే ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇలాంటి ప్రైవేట్ ఫొటోల‌ను పైగా ఒక ఆడ‌పిల్ల‌తో ఫొటోలు షేర్ చేయ‌డ‌మ‌నేది చాలా త‌ప్పుగా భావిస్తున్నారు చాలా మంది. అయితే అందుకు అలాంటి కామెంట్లే వ‌స్తాయి మ‌రి తిరిగి వాళ్ళ‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు ఆ ఫొటోలు షేర్ చేసిన‌ప్పుడే ఆలోచించుకోవాలి అని మ‌రి కొంద‌రు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: