టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కి ఎంత్ర క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈయన దర్శకత్వంలో ఏ సినిమా వచ్చినా అది కమర్షియల్ హిట్ తో పాటు మంచి మెసేజ్ ఉంటుంది.  ఈ ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘దర్భార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేశంలో పెరిగిపోతున్నా అత్యాచారాలపై ఈ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారు.  అయితే ఈ మూవీ కమర్షియల్ హిట్ అయినప్పటికీ  ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని వార్తలు వచ్చాయి.  ప్రస్తుతం మురుగదాస్ తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ మూవీ తీస్తున్నారు.  

 

 

ఇది గతంలో తుపాకీ మూవికి సీక్వెల్.  ముంబైకి చెందిన ఒక కుటుంబానికి చెందిన ఒక భారతీయ ఆర్మీ అధికారి ఒక ఉగ్రవాద గ్రూపును కనుగొని నాశనం చేసి, తన ఆర్మీనే గుఢచారులుగా తీర్చి దిద్ది స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉన్నారో కనుక్కొని వారిని అంతం చేస్తాడు.  ఆర్మీ ఆఫీసర్ పాత్రలో విజయ్ నటన సూపర్. అంతే కాదు ఈ మూవీలో స్లీపర్ సెల్స్ అనే కొత్త కాన్సెప్ట్ తెరపై చూపించాడు. ఉగ్రవాదుల్లో స్లీపర్ సెల్స్ ఎలా ఉంటారు.. వారి యాక్టివిటీస్ ఏంటీ అన్న కాన్సెప్ట్.  మొత్తానికి ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో పాటలు కూడా మంచి విజయం అందుకున్నాయి.

 

 

ఈ మూవీలో విజయ్ సరసన కాజల్ నటించింది.  తాజాగా తుపాకీ సీక్వెల్ రాబోతుంది. ఇందులో విజయ్ సరసన మరోసారి కాజల్ నే తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించి టాప్ హీరోయిన్‌గా వెలిగింది చందమామ కాజల్ అగర్వాల్.. తమిళ్ లో కూడా స్టార్ హీరోలందరి సరసన నటించింది. ప్రస్తుతం విశ్వనటుడు కమల్‌హాసన్‌కు జోడీగా `భారతీయుడు-2`లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: