ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ దెబ్బకి ప్రజలు ఎంత విలవిల్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని నిర్ములించడానికి ఆయా దేశాలు వారివారి పరిమితుల్లో వైద్య సేవలు అందించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క ప్రభుత్వమే కాకుండా అన్ని వర్గాలకి చెందిన వారు వైరస్ నిర్మూలనకు పాటుపడుతున్నారు. ఇందుకోసం దేశంలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ముందుకు సాగుతున్నారు.


ఇక అసలు విషయానికి వస్తే... కరోనా వైరస్ పోరాటంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు సందేశాలు ఇస్తూ మెగాఫ్యామిలీ ముందుకు సాగుతోంది. అయితే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లేని కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ ని ఏర్పాటు చేసి ఇ తన వంతు విరాళంగా అందజేయడమే కాకుండా మిగతా తెలుగు హీరోలను చారిటీకి విరాళాలు అందచేసేలా చూస్తున్నాడు. అంతే కాకుండా ఆయన ఉగాది రోజున ట్విట్టర్లో ఖాతా మొదలుపెట్టి దాని ద్వారా అభిమానులకు ఏదో ఒక మెసేజ్ లు ఇస్తూ ఉన్నాడు.

 


ఇక అలాగే తాజాగా మెగాస్టార్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక ప్లకార్డు తీసుకొని ఒక కరోనా మెసేజ్ తెలిపారు. అందులో "ఇంట్లోనే ఉంటాం.. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమను పంచుదాం. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం. భారీతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం. స్టే హోమ్.. స్టే సేఫ్" అంటూ చిరంజీవి నుంచి తన కుటుంబ సభ్యులైన అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, ఉపాసన, రామ్ చరణ్ తేజ్, తన ఇద్దరు కూతుర్లతో సుస్మిత, శ్రిజతో తోపాటు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్, సాయి ధర్మ తేజ్ అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ వీరందరూ కార్డులను ప్రదర్శిస్తూ మెసేజ్ ని తెలిపారు. మొత్తానికి ఈ మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ ప్లకార్డులు చూపిస్తూ ఒక మంచి సందేశాన్ని ప్రజలకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: