వెండితెర మీద పవన్ కళ్యాణ్ కనిపించి రెండు సంవత్సరాలు దాటిపోయింది. తమ అభిమాన హీరోని తెర మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ కారణంగా సినిమా షూటిగ్స్ అన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. లాక్డౌన్ ఎత్తేస్తే కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయమై కన్ఫర్మేషన్ రాదు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి.

 

కేవలం నటుడిగానే కాదు, ఫైట్ మాస్టర్ గా, డైరెక్టర్ గా స్టోరీ రైటర్ గానూ చేశాడు. సినిమా తాలూకు అన్ని శాఖల్లో పవన్ కళ్యాణ్ కి అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టిస్ చేసేవాడు. ప్రపంచ సినిమాకి మార్షల్ ఆర్ట్స్ ని పరిచయంచేసింది బ్రూస్ లో అయితే, తెలుగులో ఆ ఆర్ట్ ని చూపించింది మాత్రం పవన్ కళ్యాణే. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న కారణంగా పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాల్లో ఫైట్ సీక్వెన్సెస్ క్రియేట్ చేశాడు.

 


తన సినిమాలకే కాకుండా మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సైతం ఫైట్ మాస్టర్ గా చేశాడు. డాడీ సినిమాలో కొన్ని ఫైట్ సీన్స్ ని పవన్ కళ్యాణే క్రియేట్ చేశాడు. ఇక దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నం "జానీ" రూపంలో డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆ సినిమా అప్పుడు ఫ్లాప్ అయ్యుండచ్చు గానీ, ఇప్పటికీ జానీ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మ్యూజిక్ పరంగా సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది. పవన్ స్టైల్ ఈ సినిమాలో మరో రేంజ్ లో ఉంటుంది. చిరిగిన జీన్స్ వేసుకుని మోకాలుకి కర్చీఫ్ కట్టుకోవడం మాస్ జనాలకి పిచ్చపిచ్చగా నచ్చేసింది.

 


ఇక స్టోరీ రైటర్ గా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కి పనిచేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. సినిమాలో మేజర్ క్రాఫ్ట్ అన్నింటిలో పనిచేసి అనుభవం సంపాదించిన పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఇందులో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: