ఇప్పుడు హీరోలు దర్శకులు అందరూ ఖాళీ గానే ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క ప్రాజెక్ట్ అయినా చాలు అనుకునే విధంగా కొందరు నిర్మాతలు ఉన్నారు. ఈ తరుణంలో కొందరు హీరోలు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. తమ సినిమా కథలను తమకు నచ్చిన విధంగా మార్చుకోవడమే కాకుండా ఇప్పుడు లాక్ డౌన్ పరిస్థితిని కూడా తమ సినిమాలో ఒక పది నిమిషాలు అయినా చూపించాలి అని భావిస్తున్నట్టు సమాచారం. లాక్ డౌన్ కారణంగా సినిమా కార్మికులు పడిన కష్టాన్ని చూపించే అవకాశం ఉందని అంటున్నారు. 

 

కథలో ఈ కోణం కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొందరు హీరోల సినిమాల్లో లాక్ డౌన్ రోజులను దేశం పడుతున్న కష్టాలను చూపించే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవి ఇప్పటికే దీని మీద నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా దీన్ని ఏదోక విధంగా చూపిస్తే బాగుంటుంది అని రాజమౌళి భావిస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఏ సినిమాలో దీన్ని చూపించే అవకాశం ఉంది అనేది చూడాలి. 

 

ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల్లో కచ్చితంగా లాక్ డౌన్ కష్టాలను చూపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. త్వర లోనే దీనికి సంబంధించి రచయితల తో హీరోలు మాట్లాడే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇది సినిమాలో ఉంటే జనాలకు పరిస్థితి తీవ్రత కొంత అయినా అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏయే సినిమాలో వీటిని ఉంచే విధంగా నిర్మాతలు అంగీకరిస్తారు అని అంటున్నారు.  కాగా చిరంజీవి ఒక్కరే దీని మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: