నాటి పాత తరం హీరోయిన్లకు నేటి కొత్త తరం హీరోయిన్ లకు మధ్యలో స్టార్ హీరోయిన్గా దశాబ్దకాలం పాటు కొనసాగి ఎన్నో విప్లవాత్మక సినిమాలలో  నటించడంతో పాటు ఎంతో మంది హీరోల సినిమాల్లో నటించి తన అందం అభినయంతో  ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న గొప్ప నటి రోజా. అప్పట్లో ఏ స్టార్ హీరో సరసన చూసినా ఈ హీరోయిన్ కనిపించేది. ఆ హీరోహీరో అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి అదరగొట్టింది రోజా. కేవలం హీరోల సరసన నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు... సమ్మక్క సారక్క లాంటి ఎన్నో లేడీ ఓరియంటెడ్ విప్లవాత్మక సినిమాల్లో నటించి ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. 

 

 

 ఇప్పటికి రోజా అంటే ఒక హీరోయిన్గానే చాలామంది చూస్తూ ఉంటారు.. హీరోయిన్ గా తన కెరియర్ ముగిసిపోయి ఎన్నో ఏళ్లు అయినప్పటికీ ఇప్పటికీ తరగని అందం అభినయం రోజా సొంతం అనే చెప్పాలి. ఇప్పటికీ అదే అందంతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది నాటి స్టార్ హీరోయిన్ రోజా. జబర్దస్త్ లో జడ్జ్ గా  తన నవ్వుల తో పువ్వులు పూయిస్తూ... ఇప్పటికి ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అనే చెప్పాలి. ఓవైపు రాజకీయాల్లో బిజీబిజీగా ఒక పవర్ఫుల్ ఉమెన్గా మహిళా సాధికారత చాటుతూనే.. మరోవైపు బుల్లి తెర పై ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది రోజా. 

 

 

 ఇక ఆనాడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కాలంలో రోజా పువ్వు లాంటి అందం తో ప్రేక్షకుల మతి పోగొట్టింది అనే చెప్పాలి. హీరోలతో సరిధీటుగా  డాన్సులు చేస్తూ... అదరగొట్టిన రోజా తన నటనతో కూడా ఎంతో మంది ప్రేక్షకుల ను సంపాదించుకుంది. అయితే రోజా సినిమాలకు దూరమై ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు సినిమాల వైపు మాత్రం తిరిగి చూడలేదు. అయితే రోజా అభిమానులు మాత్రం రోజా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు.  మరి అభిమానుల కోరిక తీరుతుందా లేదా  అన్నది మాత్రం ఎవరికీ తెలియని ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: