ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి హీరోల మధ్య స్నేహబంధం ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఎక్కడయినా కలిస్తే చాలు ఆప్యాయంగా పలకరించు  కుంటూ ఉంటారు. అయితే ఇలా స్టార్ హీరోల మద్య స్నేహం అటు అభిమానుల్లో కూడా తెగ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా ఎన్నో ఏళ్ల నుంచి మంచి స్నేహబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇద్దరూ ఒకరికొకరు ఎంతో గౌరవించుకుంటూ ఆప్యాయంగా పలకరించి కుంటూ ఉంటారు. అయితే అటు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగగా... ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోగా మారిపోయాడు. మామూలుగా అయితే స్టార్ హీరోల మధ్య స్నేహ బంధం బలంగా ఉన్నప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తే బాగుండు అని ఆ హీరోలు అనుకోవడం తో పాటు వారి అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు.. 

 

 

 అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య స్నేహబంధం కొనసాగుతున్నప్పటికీ వారి కోరిక మాత్రం ఇన్నాళ్ళకి తీరింది . ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏ సినిమాలు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా...  జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా కథ విన్నప్పుడు తాము ఎంతగానో సంతోషం వ్యక్తం చేసి ఒకరినొకరు ఆలింగనం  చేసుకున్నాము అంటూ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చెప్పిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: