మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనగానే తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఇప్పుడు అతనికి మంచి క్రేజ్ ఉంది. స్టార్ నిర్మాతలు హీరోలు అతనితో సినిమా చేయడానికి గానూ ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఛాన్స్ అతనితో వచ్చినా చాలు అనుకునే పరిస్థితి ఉంది తెలుగులో కొందరు హీరోలకు. చివరికి మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా సరే పెద్దగా ఫలించడం లేదు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. 

 

ఇక ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబు తో కాకుండా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ముందు నుంచి మహేష్ విషయంలో కాస్త దూరంగా ఉంటున్న త్రివిక్రమ్ ఇప్పుడు మళ్ళీ మహేష్ మీద దృష్టి పెడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ లో. ఇప్పుడు మహేష్ బాబు చాలా వరకు బిజీ గానే ఉన్నాడు. అతనితో సినిమా చేయడానికి గానూ కొంత మంది నిర్మాతలు హీరోలు ఎదురు చూస్తున్నారు కూడా. ఇక ఇది పక్కన పెడితే... 

 

మహేష్ మాత్రం ఇప్పుడు త్రివిక్రమ్ తో అవకాశం వస్తే చాలు వేరే వాళ్ళను పక్కన పెట్టాలి అనే విధంగా ఆలోచన చేస్తున్నాడు అని అంటున్నారు. రాజమౌళి తో సినిమాను మహేష్ వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్  కోసం మహేష్ బాబు ఆ సినిమా ను లేట్ అయినా పర్వాలేదు అని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం తెలియదు గాని ఈ ప్రాజెక్ట్ మాత్రం రావడం ఖాయం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: