ఆయన గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. తెలుగు సినిమా రంగాన్ని యావత్తూ శాసించే నందమూరి తారకరాముని ముద్దుల తనయుడు. ఆయన పద్నాలుగేళ్ళకే బాలనటుడిగా పరిచయం అయ్యాడు. అటువంటి బాలయ్యకు హీరో చాన్స్ మిస్ అవడమా. నిజంగా అది వింతే మరి.

IHG

 

కానీ బాలయ్యకు హీరో అవకాశం తొలిరోజుల్లోనే వచ్చింది. బాలయ్య అప్పటికి ఓ వైపు చదువుకుంటూ సెలవుల్లోనే   నటిస్తున్నాడు. అది కూడా తన సొంత బ్యానర్లోనే. అన్నగారి డైరెక్షన్లోనే. దాంతో బాలయ్యకు పరిమితులు చాలా ఉన్నాయి.

IHG

 

చదువు పూర్తి అయ్యేదాకా హీరో వేషం వేయకూడదు. అది కూడా బయట బ్యానర్లలో అసలు వేయకూడదు. ఆ విధంగా బాలయ్యకు పెద్దాయన కండిషన్లు పెట్టాడు. దాంతో బాలయ్య తన తండ్రితోనే కలసి ఏకంగా 11 సినిమాల్లో  నటించారు.

IHG

 

ఇదిలా ఉండగా బాలయ్యకు తొలి చాన్స్ హీరోగా వచ్చింది శివరంజని సినిమాకు. ఆ సినిమాను దర్శకరత్న దాసరి నారాయణరావు స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ జయసుధ. హీరోగా బాలయ్యబాబుని దాసరి అనుకున్నారు. తన సినిమా ద్వారా బాలయ్యని హీరోగా పరిచయం చేద్దామని దాసరి భావించారు.

IHG

 

ఆ విషయాన్ని ఆయన అన్నగారి చెవిన వేశారు. అయితే ఎన్టీయార్ ఖరాఖండీగా నో చెప్పేశారు. మా బాలయ్య  హీరోగా వేయాలంటే ముందు చదువు పూర్తి చేసుకోవాలి. అపుడే బయట బ్యానర్ల నుంచి నటించేందుకు అనుమతిస్తామంటూ అన్నగారు చెప్పేయడంతో ఆ చాన్స్ మరో కొత్త నటుడు హరిప్రసాద్ కి దక్కింది.  ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా అయింది.

IHG

 

మొత్తానికి బాలయ్య తొలి హీరో చాన్స్, పైగా మేటి నటి  జయసుధ పక్కన నటించే చాన్స్ కూడా అన్నగారే దగ్గరుండి మరీ మిస్ చేశారన్నమాట. ఇక దాసరి దర్శకత్వంలో బాలయ్య మళ్ళీ నటించడానికి మూడు దశాబ్దాల పైగా సమయం పట్టించి. అలాగే జయసుధతో కలసి బాలయ్య నటించడానికి కూడా అంతే సమయం పట్టింది. మొత్తానికి  బాలయ్య టాప్ రేంజి హీరో అయ్యాడు కానీ తొలి చాన్స్ మిస్, సూపర్ హిట్ మూవీల నటించలేదన్న వెలితి అలాగే ఉండిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: