టాప్ హీరోలతో వర్క్ చేస్తే హీరోయిన్ల కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంటుంది. స్టార్ హీరోయిన్ గా కోట్ల రెమ్యునరేషన్ అందుకునే అవకాశం దొరుకుతుంది. కానీ అను ఇమ్మాన్యుయేల్ మాత్రం మెగా మూవీస్ చేసినా కెరీర్ ముందుకు వెళ్లడం లేదు. దీంతో సిల్వర్ స్క్రీన్ నుంచి డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తోందట అను. 

 

అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ బిగినింగ్ లోనే టాప్ హీరోలతో వర్క్ చేసింది. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నాపేరు సూర్యలో రొమాన్స్ చేసింది. అయితే అను కెరీర్ కు బిగ్ బ్రేక్ ఇస్తాయనుకున్న ఈ రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో అను కెరీర్ కూడా కష్టాల్లో పడింది. 

 

అను ఇమ్మాన్యుయేల్ డైరీలో అల్లు అదుర్స్ తప్ప మరో మూవీ లేదు. దీంతో ఈ సినిమా తర్వాత అను పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కొంతమందైతే ఈమె కెరీర్ క్లైమాక్స్ కు చేరుకుందనే కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కెరీర్ ను గట్టెక్కించుకోవడానికి ఆల్టర్ నేటివ్స్ వెతుక్కుంటోంది అను.

 

అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళ్ లో చాలా ట్రై చేస్తోంది గానీ.. పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. దీంతో బిజీగా ఉండటానికి సినిమాలు కాకపోతే వెబ్ సిరీస్ లు చేస్తానని చెబుతోందట. 

 

ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ వస్తే వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు సిద్ధమని మేకర్స్ కు హింట్స్ కూడా ఇస్తోందట అను. మరి సినిమాల నుంచి వెబ్ సిరీస్ లకు చేరిన అను కెరీర్ మున్ముందు ఎలాంటి టర్నింగ్స్ తీసుకుంటుందో చూడాలి.

 

మొత్తానికి అను ఇమ్మానుయేల్ ఎంత కష్టపడినా.. కష్టానికి తగ్గ ఫలితం తగ్గడం లేదు. స్టార్ హీరోలతో మూవీస్ చేసినా ఆ బ్యూటీ కెరీర్ ముందుకు సాగడం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: