మీకు స్మార్ట్ ఫోన్ ఉందా. అయితే మీ ఫోన్ లో కచ్చితంగా ఈ యాప్ లు ఉండి తీరాల్సిందేనంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇటీవల మ్యూజింగ్స్ అంటూ తన ప్రసంగాలు వినిపిస్తున్న పూరీ.. తాజాగా యాప్ ల గురించి వివరించారు. మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారని అనుకుంటున్నారా? ఆ అనుమానమే మీకుంటే కచ్చితంగా ఈ యాప్ వాడండి అని సలహా ఇస్తున్నారు పూరీ. మీ ఫోన్‌ను ఎవరూ హ్యాక్‌ చేయకుండా రక్షించుకోవాలంటే ‘NERDVPN’ అనే యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ యాప్ వాడితే.. ఎవరు ఎప్పుడు మన ఫోన్ తో కనెక్ట్ అవ్వాలని చూసినా వెంటనే మనకు తెలిసిపోతుందట. మంచి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న యాప్ ఇది అని చెబుతున్నారు.
ఇక షాపింగ్ పిచ్చి ఉన్నవారికోసం ఫ్యాన్సీ అనే యాప్ ఉందట. ఇందులో అరుదైన కలెక్షన్లు దొరుకుతాయని చెబుతున్నారు. సినిమా యాక్టర్స్ వాడే దుస్తులపై మీకు ఇష్టం ఉంటే.. అచ్చు అలాంటి దుస్తుల్నే ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయొచ్చట. సినిమాలకోసం తనకీ యాప్ బాగా ఉపయోగపడుతుందని చెబుతారు పూరీ. ఇక ఇంగ్లిష్ లో తప్పులు సరిదిద్దుకోడానికి కరెక్ట్ మి అనే యాప్ ఉపయోగించాలని చెబుతున్నారు. ఫొటోస్ ఎడిట్ చేసుకోడానికి కంప్యూటర్ అక్కర్లేదని, అల్ట్రా లైట్ అనే యాప్ తో ఫొటోల్ని అందంగా ఎడిట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అల్ట్రా లైట్ యాప్ వాడేవాళ్లు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారని, అందులో ఎడిట్ చేసిన ఫొటోలతో స్నేహితుల్ని ఆశ్చర్యపరచవచ్చని చెప్పారు పూరీ.

చరిత్ర విశేషాలు తెలుసుకునేందుకు పూరీ జగన్నాథ్ ‘హిస్టరీ వాల్ట్‌’ అనే యాప్ వాడతారట. విదేశాల్లో మనకి బాగా పనికి వచ్చే యాప్స్ కూడా కొన్ని ఉన్నాయట. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో రూ.1000కి గది కావాలన్నా దొరుకుతుందని, ఎయిర్ బీఎన్డీ అనే యాప్ వాడితే అద్దె గదుల వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇక అద్దె కూడా కట్టలేనిస్థితిలో ఉంటే మరో యాప్ విదేశాల్లో మనకి షెల్టర్ చూపిస్తుందట. విదేశాలకు వెళ్లినప్పుడు అద్దెకు గది కూడా తీసుకోలేని స్థితిలో ఉంటే ‘కౌచ్‌ సర్ఫింగ్‌’ అనే యాప్ వాడితే చాలు.. అందులో కొంతమంది ఇంటి యజమానుల వివరాలుంటాయి. వారు మనకి ఇంట్లో ఓ గదిని ఉచితంగా ఇస్తారు. ఇక విదేశాల్లో మనకి సాయం చేసే వ్యక్తుల్ని వెదుక్కోడానికి కూల్‌ కజిన్ అనే యాప్ బాగా ఉపయోగపడుతుందట. అయితే ఈ యాప్ లలో దొరికిన సమాచారం సరైనదా లేదా అనే విషయం మనమే నిర్థారించుకోవాలని సలహా ఇస్తున్నారు పూరీ జగన్నాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి: