షూటింగ్ లు పునఃప్రారంభం కావడానికి ముఖ్యమంత్రులతో రాయబారాలు చేసిన చిరంజీవి ఆతరువాత షూటింగ్ లకు అనుమతులు వచ్చాక తన ‘ఆచార్య’ షూటింగ్ విషయంలో వెనుకడుగు వేస్తూ తన కన్ఫ్యూజన్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ విషయమై టెన్షన్ పడిపోతున్న కొరటాల ఒత్తిడికి తలొగ్గి ఈ మూవీ షూటింగ్ ను వచ్చేనెల నుండి మొదలు పెట్టడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే దీనికి మెగా స్టార్ కొరటాల కు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు టాక్. ‘ఆచార్య’ షూటింగ్ ను తాను లేకుండా కొన్నిరోజులు ఈ మూవీలోని ఇతర పాత్రతో షూట్ చేయమని చిరంజీవి సలహా ఇచ్చినట్లు టాక్. అలా జరిగే షూటింగ్ ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా జరిగింది అన్న నమ్మకం తనకు కలిగితే తాను ఈ మూవీ షూటింగ్ లో ఆతరువాత జాయిన్ అవుతాను అని చెప్పినట్లు గాసిప్పులు వస్తున్నాయి.


దీనితో కొరటాల చిరంజీవి లేకుండానే ‘ఆచార్య’ షూటింగ్ మొదలుపెట్టి కొన్నిరోజులు కొనసాగిస్తాడని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈమూవీలో కీలక పాత్ర అయినటువంటి రామ్ చరణ్మూవీ షూటింగ్ స్పాట్ కు వచ్చే విషయంలో కూడ ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ కాజల్ ఈనెల 30న పెళ్ళి చేసుకున్న తరువాత ఆసియా ఖండంలోని కరోనా సమస్యలు లేని ఒక చిన్న దేశానికి హనీమూన్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.


దీనితో చిరంజీవి చరణ్ కాజల్ లు లేకుండా ఇక ఎవరితో ఈ మూవీ షూటింగ్ కొనసాగించి చిరంజీవికి ధైర్యం కలిగించాలి అన్న ప్రశ్నకు సమాధానం లేక కొరటాల తెగ మధన పడుతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. ఒక టాప్ రేంజ్ దర్శకుడు ఒక సినిమాను నమ్ముకుని రెండు సంవత్సరాలు పైగా వేచి ఉండటం అనవసరం అయినప్పటికీ ప్రస్తుతానికి కొరటాలకు మరో మార్గం లేకపోవడంతో పరిస్థితులలో రాజీపడుతున్నాడు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: