స్టార్ మాని అగ్రస్థానంలో నిలబెట్టడానికి.. టి.ఆర్.పి రేటింగ్స్ లో దుమ్ముదులిపేస్తున్న సీరియల్ కార్తీకదీపం. నిరుపం పరిటాల, ప్రేమి విశ్వనాథన్ కలిసి నటిస్తున్న ఈ సీరియల్ ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. స్టార్ మా నంబర్ 1 సీరియల్ ఏది అంటే కార్తీకదీపం అని చెబుతారు. స్టార్ మాలోనే కాదు తెలుగు డైలీ సీరియల్ లో అందరు మెచ్చే సీరియల్ కార్తీక దీపం. 7:30 అయ్యింది అంటే కార్తీకదీపం వచ్చేస్తుంది. వంటలక్కని చూడాల్సిందే అంటూ టివిలకు అతుక్కుపోతారు.

ఇక ఇదిలాఉంటే ఆ సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్క అలియాస్ దీపని కలిపేందుకు నానా ప్రయత్నాలు జరుగుతాయి. ఈ క్రమంలో సీరియల్ లో వీరిద్దరు కలవడం లేదని ఓ స్పెషల్ షో చేస్తున్నారు. దసరా కానుకగా చేస్తున్న స్పెషల్ షో జాతరో జాతర. ఈ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా కార్తీకదీపం స్టార్ కాస్ట్ నిలుస్తుంది. ఎలాగు సీరియల్ లో డాక్టర్ బాబు, దీప ఎప్పుడు కలుస్తారో ఏమో అని ఈ షోలో వారిద్దరిని కలిపి షోకి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా చేస్తున్నారు.

ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే బిగ్ బాస్ లో స్టార్ గా మారిన గంగవ్వ వీరిద్దరిని కలుపుతుంది. బిగ్ బాస్ లో ఉన్నా కూడా డాక్టర్ బాబు, దీపని ఏమంటాడో అని గంగవ్వ ప్రస్థావించింది. అందుకే గంగవ్వతోనే వీరిద్దరిని కలిపుతున్నారు. మొత్తానికి కార్తీక దీపం ఫేం ను స్టార్ మా అలా వాడేస్తుందన్నమాట. ప్రేమి విశ్వనాథన్ క్రేజ్ ను స్పెషల్ షోలో అలా వాడేస్తున్నారు. మరి ఈ షో ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.                                               

మరింత సమాచారం తెలుసుకోండి: