పాట అంటే హీరో మరియు హీరోయిన్ కలిసి చేస్తారనే విషయం మనకి తెలుసు .. కానీ నేను చెప్పబోయే ఈ పాట అన్ని పాటలతో పోలిస్తే  చాలా ప్రత్యేకమైనది ..  కొన్ని సినిమాలలో పాటలు  హీరో హీరోయిన్ తో డాన్స్ చేయడం మనం చూసే ఉంటాము .అల  చేసాక ఆ తర్వాతి కొన్ని సినిమాలలో  ఒక అగ్ర  హీరో కోసం పాటలు చేయడం మొదలు పెట్టారు.. ఆ పాటలు కూడా కొత్తగా ఉండేవి అటువంటి పాటల్ని  ప్రేక్షకులు ఇష్టపడేవారు . అల కొన్ని సినిమాలలో అగ్ర హీరోలతో మరియు అగ్ర హీరోయిన్స్ తో  కలిసి  కొన్ని పాటలు  చేసారు..ఉదాహరణ చూస్తే  కింగ్ సినిమాలో నాగార్జున  మల్టీ హీరోయిన్స్ తో  కలిసి డాన్స్ చేసారు..

ఒక పాటలే కాదు మల్టీస్టార్ సినిమాలు కూడా చేసారు .మనం ఇప్పుడు మల్టీస్టార్ సినిమా అని అంటున్నాము కానీ
మీరు చూస్తే పాత  సినిమాలు ఎక్కువగా మల్టీస్టార్ సినిమాలే .ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలం నుంచి.. ఇప్పుడు రామ్‌చరణ్-తారక్ కాలం వరకు  మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.. మధ్యలో వచ్చే అగ్ర హీరోల పాటల్ని కూడా ప్రేక్షకులు ఆదరించేవారు ..ఆ పాట కోసం అయినా థియేటర్ కి వచ్చేవారు ..

అసలు విషయానికొస్తే.. వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్ర ప్రసాద్‌ కాంబినేషన్లో టి.సుబ్బిరామిరెడ్డి సమర్పణలో దర్శకుడు మురళీ మోహన్‌ రావు తెరకెక్కించిన చిత్రం త్రిమూర్తులు. 1981లో వచ్చింది ఈ చిత్రం. ‌ బప్పీ లహరి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ఓ ఫంక్షన్ నేపథ్యంలో ఒకే మాట ఒకే బాట   పాట ఉంటుంది .. పాట అంటే హీరో మరియు హీరోయిన్ ఉంటారనుకుంటే పప్పులో కాలువేసినట్టే  

ఈ పాటలో ఏకంగా 20మంది నాటి అగ్రతారలు స్క్రీన్‌ పై కనపడతారు .ఆ అగ్రతారలు ఎవరంటే  శోభన్‌‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, దర్శకుడు కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ, శారద, విజయ నిర్మల, విజయ శాంతి, రాధ, జయమాలిని, పరుచూరి బ్రదర్స్, మురళీ మోహన్, గొల్లపూడి మారుతి దర్శనమిచ్చారు...
.అప్పటి నుంచి ఇప్పటివరకు మరే సినిమాలోనూ ఇంతమంది అగ్రనటులు కనిపించిన దాఖలాలు లేవు. తెలుగు సినీ   చరిత్రలోనే ఇదొక రికార్డు.



మరింత సమాచారం తెలుసుకోండి: