న్యాచురల్ స్టార్ నాని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగ్ రాయ్ అనే వెరైటీ సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన వి సినిమా ప్రయోగాత్మకంగానే రిలీజ్ అయ్యి భారీ ఫ్లాప్ ని చేసింది.. థియేటర్లు లేకపోవడంతో ఆమెజాన్ లో ఈ సినిమా రిలీజ్ కాగా ప్రేక్షకులు దీన్ని బాగా రిసీవ్ చేసుకోలేకపోయారు.. దాంతో ఇప్పుడు చేస్తున్న టక్ జగదీష్ పై ఆశాలు పెట్టుకున్నాడు..

 నిన్ను కోరి సినిమా తో పరిచయమై ఫీల్ గుడ్ మూవీస్ ని కొత్తగా చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. తొలి  సినిమా ని ఆయన ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ముగ్డులయిపోయారు..లైన్ కాస్త పాతదే అయినా అందులోని కంటెంట్ కొట్టగా నింపి ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యాడు..రెండో ప్రయత్నంగా నాగ చైతన్య తో మజిలి సినిమా చేసి ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశారు. ఈ సినిమా తో మొదటి సినిమాలో పడ్డ ఒకటో రెండో నెగెటివ్ మార్కులు కాస్త పాజిటివ్ గా మారిపోయాయి.. ఇక మూడో సినిమాగా మళ్ళీ నాని తో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తునాడు.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి..

ఇక నాని ఇటీవలే మరో సినిమాని ప్రకటించి షాకిచ్చాడు. ఈ సినిమా టైటిల్ బాపు జంధ్యాల మార్కులో పెద్ద వంశీ ఎంపికలా ఆకట్టుకుంది.  `అంటే సుందరానికీ!` అంటూ ఆశ్చర్యార్థకంతో టైటిలే ఎంతో ఫన్నీగా ఆకర్షిస్తోంది. బాపు-రమణల రైటింగ్ టింజుతో పెద్ద వంశీ ఐడియాలజీతో జంధ్యాల రేంజులో ఈ సినిమాని తెరకెక్కిస్తారా? అన్న సందేహం కలగక మానదు తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ వీక్షిస్తుంటే. డీసెన్సీ లేక ఇటీవల ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన కామెడీ అంతరించినట్టయ్యింది. దీంతో అలాంటి సినిమా చూడాలనుకునే ఔత్సాహికులకు సరైన అవకాశమే లేకుండా పోయింది. సడెన్ గా నాని ప్రత్యక్షమై ఈ పోస్టర్ తో పాత జ్ఞాపకాల్ని తిరగతోడారు. తాజా పోస్టర్ చూస్తుంటే ఆ రేంజు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: