ప్రతిభ ఉండాలే కానీ ఆకాశమే హద్దు దూసుకుపోవడానికి అంటారు. తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య ఆకాశమే హద్దు మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫారం ద్వారా రిలీజ్ అయి మంచి మార్కులు సంపాదించింది. ఈ మూవీలో సూర్య నటన శభాష్ అనిపించేలా ఉంది. సూర్య అయితే  సూపర్ స్టార్ కానీ ఆయన పక్కన నటించిన హీరోయిన్ మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి. ఆమెకు అందంతో పాటు అభినయం కూడా కూడా ఉంది.

సినిమా చూసిన వారికి అర్ధం అవుతుంది. సినిమా మొత్తం భారాన్ని సూర్య తో పాటు గా అపర్ణ కూడా మోసిందని. నిజానికి ఈ మూవీ కంటెంట్ అలాంటిది. దానికి తగిన న్యాయం చేసిన హీరోయిన్ గా అపర్ణ బాలమురళిని చెప్పుకోవాలి. ఈ అమ్మడు అచ్చమైనా మళయాళీ కుట్టీ. ఆమె తండ్రి బాలమురళి సినిమా మ్యూజిక్ కంపోజ‌ర్, ఎన్నో సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఇక తల్లి శోభ  ప్రొఫెషనల్ లాయర్, అంతే కాదు మంచి గాయని, ఆమె కూడా సినిమాల్లో పాడింది. ఇపుడు అపర్ణ విషయానికి వస్తే ఆమె కూడా మంచి గాయని, అంతే కాదు డ్యాన్సర్ కూడా.

అపర్ణ కూచిపూడి, భరతనాట్యం, మోహినీయాట్టం నేర్చుకున్నారు. ఆమెలో అందుకే సులువుగా భావాలు పలుకుతున్నాయి. మళయాళంలో కొన్ని సినిమాల్లో నటించిన అపర్ణ  2017లో తమిళనాట ఒక మూవీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆమెకు ఆకాశమే హద్దుగా అన్నది మూడవ తమిళ సినిమా. ఈ సినిమాతో అదరగొట్టిన అపర్ణకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

ఆమె బాలన్స్డ్ యాక్షన్ కి జనాలు ఫిదా అవుతున్నారు. అయితే తాను సెలెక్టివ్ గానే సినిమాలు ఒప్పుకుంటాను అని అపర్ణ చెబుతోంది. ఆమెను చూస్తూంటే  మరో నయనతార  ఇండస్ట్రీకి వచ్చిందా అనిపిస్తోంది. అపర్ణ అందమైన కళ్ళు పలికించే భావాలు సినిమా మేకర్స్ కి విలువైన సంపదగానే చెప్పాలి. ఆమె మరిన్ని మంచి పాత్రలతో అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: