మెగా బ్రదర్ నాగబాబుకు సామాజిక చైతన్యం ఎక్కువ ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ‘మన ఛానల్ మన ఇష్టం’ ద్వారా అనేక విషయాల పై నాగబాబు స్పందిస్తున్నాడు. సినిమా విషయాలతో పాటు అనేక సామాజిక  సామాజిక అంశాల పై స్పందిస్తూ నాగబాబు పెడుతున్న వీడియోలకు మంచి స్పందన వస్తోంది.  


ఈ నేపధ్యంలో నాగబాబు తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం గురించి పెట్టిన వీడియోలో తాను గతంలో వరుణ్ తేజ్ నిహారికల పెంపకం విషయంలో చేసిన పొరపాట్లను తెలియచేసాడు. తాను గొప్ప కమ్యూనికేటర్ ని కాకపోవచ్చు కాని ఎంతోకొంత బెటర్ అని తన ఫీలింగ్ అని చెపుతూ తన  పిల్లలు నిహారిక వరుణ్ లకు చాలావిషయాలు వాళ్ళ చిన్నతనంలో చెప్పిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.  


అయితే తన పిల్లలు తప్పు చేస్తే తిట్టడం కొట్టడం లాంటివి గతంలో చాలా చేసానని నిహారిక వరుణ్ లను ఒకటి రెండు సార్లు కొట్టాను అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అప్పట్లో తనకు మెచ్యూరిటీ లెవెల్స్ సరిగ్గా లేకపోవడంతో అలాంటి తప్పులు చేసానని అయితే ఇప్పుడు ఆ తప్పులు గుర్తుకు వచ్చి తాను బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టాడు.


ఆతరువాత తన పొరపాట్లు తెలుసుకుని తన పిల్లలని పిలిచి వాళ్లకు జీవితంలో ఏసమస్య వచ్చినా తాను మాత్రమే అర్ధం చేసుకుని సహాయ పడగలను అన్న భరోసా ఇచ్చానని ఈ భూమి మీద తన పిల్లలకు తనకంటే ఆప్తుడు ఎవరు లేరు అన్నగ్యారెంటీ ఇవ్వడమే కాకుండా వారు ఏతప్పు చేసినా వెంటనే ధైర్యంగా తనతో చెప్పమని చెప్పిన ఆనాటి విషయాలను ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నాడు. ముఖ్యంగా వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నప్పుడు సినిమా కెరియర్ లో సక్సస్ కాలేకపోయినా బెంగ పడవద్దని జీవితంలో సక్సస్ సాధించాలి అంటే సినిమా కెరియర్ ఒక్కటి మాత్రమే కాదు అంటూ తాను ధైర్యం కల్పించిన విషయాన్ని తెలియచేస్తూ తల్లి తండ్రులు తమ పిల్లలను స్నేహితులుగా చూడాలి అంటూ నాగబాబు పిల్లల పెంపకం పై తన భావాలు పంచుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: