దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు ఇండస్ట్రీలో ఓ సరికొత్త చరిత్రను సృష్టించారు. ఆయన టాలీవుడ్ పైతరం నటుల్లో ప్రతి ఒక్క హీరోతోనూ సినిమా తీశారు. ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా మారేందుకు ఆయన సినిమాలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ఈయన గత మూడేళ్ల నుంచి ఒక్క సినిమాను కూడా తెరకెక్కించలేదు. 2017లో చివరగా అక్కినేని నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. రాఘవేంద్ర రావు ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన ఎన్నడూ ఇన్నేళ్ల గ్యాప్ తీసుకోలేదు. అయితే ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్న తరువాత ఆయన మళ్లీ షూటింగ్‌లలో బిజీ కానున్నట్టు తెలుస్తోంది.

కానీ ఈ సారి ఆయన దర్శకత్వం వహించరట.. ఈ సారి ఆయన హీరోగా నటిస్తున్నారు. ఈ వార్త వింటేనే ఆశ్చర్యానికి గురవుతున్నారు కదా. అవును.. రాఘవేంద్రరావు హీరోగా మారుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆయనకు జోడీగా నటి రాశీ ఖన్నా నటిస్తోందట. ఆమెతో కలిపి మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నట్టు టాక్. ఈ సినిమాకు ఆయన సొంత బ్యానర్ అయిన ఆర్కా మీడియా వర్క్స్ ప్రొడ్యూస్ చేస్తోందట. మరి ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తున్నారనేగా మీ డౌట్. సీనియర్ నటుడు తనికెళ్ల భరణిసినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకుంటున్నారట.

తనికెళ్ల భరణి గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మిథునం సినిమాను తీసిని విషయం తెలిసిందే. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు కూడా రాఘవేంద్రరావుతో ఆ తరహా సినిమానే తనికెళ్ల భరణి తీయబోతున్నారా అన్నది కూడా చర్చ సాగుతోంది. అయితే ఈ సినిమాలో రాశీ ఖన్నా వంటి యంగ్ హీరోయిన్లు నటిస్తుండటంతో ఈ చిత్ర కథ అసలు ఏ విధంగా ఉండనుందోనని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: