క్రేజీ యూత్ ఐకాన్, రౌడీ హీరో విజయ్ దేవర కొండ తన తర్వాతి మూవీపై అప్పుడే ఫోకస్ పెట్టేశాడట. ప్రస్తుతం విజయ్.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారమే విడుదలైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివిటీ అంటే గుర్తొచ్చే డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడీ డైరెక్టర్.

విజయ్ తర్వాతి చిత్రం సుకుమార్‌తోనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటుందని, బొమ్మ అద్దిరిపోద్ది అని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం తాజాగా వినిపిస్తున్న వార్తలు వింటుంటే ఇది నిజమే అనిపిస్తోంది. సుకుమార్, విజయ్ కాంబోలో భారీ మూవీకి ప్లాన్ చేస్తున్నారట. ఇది ఓ పీరియాడికల్ చిత్రమని టాక్ వినిపిస్తోంది.

కాగా.. ఈ సినిమా నేపథ్యం గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా ఇండియా - పాకిస్తాన్ విడిపోయిన కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కనుందట. హై ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తారని సమాచారం. దేశం విడిపోయిన సమయంలో పాకిస్తాన్ - ఇండియా మధ్య జరిగిన యుద్ధం ఈ సినిమాలో కీలకమైన ఘట్టమట. అప్పటి వార్ లో ఇండియా గెలుపు కోసం ఒక జవాన్ ఎంత గొప్పగా పోరాటం చేశాడనే కోణంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఆ జవాన్ పాత్రలోనే మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడట.

పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్న ఈ మూవీ దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుందట. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘పుష్ప’. ఈ సినిమా పూర్తవ్వగానే విజయ్ సినిమా మొదలుకానుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా.. కేదార్ సెలగం శెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: