బాలయ్య పక్కా మాస్ హీరో. పైగా బాలయ్య డైరెక్టర్స్ హీరో. ఆయనను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో స్టడీ చేసి స్క్రీన్ మీద అద్భుతంగా ప్రెజెంట్ చేసే డైరెక్టర్స్ చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారితో బాలయ్య కాంబో కుదిరినపుడు కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టరే అవుతుంది.

అలాంటి సూపర్ డూపర్ హిట్ కాంబో బాలయ్య బోయపాటిలది. ఈ ఇద్దరూ కలిస్తే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. బాలయ్య బాడీ లాంగ్వేజ్ ని బట్టి. ఆయన స్టైల్ ని బట్టి కధను అల్లుకోవడం బోయపాటి స్పెషాలిటీ. అందుకే ఈ ఇద్దరి జోడీలో రెండు సూపర్ డూపర్ హిట్లు పడ్డాయి. సింహా, లెజెండ్ ఒక దానికి మించి మరోటి సూపర్ హిట్ అయ్యాయి. ఇక బాలయ్య బోయపాటి కలసి పనిచేయడానికి ఏడేళ్ల టైం పట్టింది.

ఇదిలా ఉంటే ఇపుడు బాలయ్య కు అర్జంటుగా హిట్ కావాలి. అలాగే వినయ విధేయ రామా తరువాత బోయపాటికి కూడా సరైన హిట్ కావాలి. దాంతో ఈ జోడీ సెట్ అయింది. కరోనా కనుక లేకపోతే ఈ సంక్రాంతి కింగ్ బాలయ్య మూవీయే అయ్యేది. ఇపుడు అన్ని అడ్డుకుంటూ  దాటుకుంటూ బోయపాటి బాలయ్య సినిమా శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.

ఈ మూవీని ఉగాది కానుకగా ఈ ఏడాది ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అదే కనుక నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కి అదే పెద్ద పండుగ అవుతుంది. ఇదిలా ఉంటే చాలా సైలెంట్ గా ఈ మూవీ ఇపుడు షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య నుంచి ఫ్యాన్స్ ఆశించే అన్ని వేరియేషన్స్ ఆయన పాత్రలో ఉంటాయని అంటున్నారు. పైగా బాలయ్య డ్యూయల్ రోల్ కూడా ప్లే చేస్తున్నాడు. సో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని రాసుకోవచ్చు అంటున్నారు. చూడాలి మరి దాని సత్తా ఏ రేంజిలో సాగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: