ఇండియా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు శంకర్.. దక్షినాదినుంచి దేశం మొత్తం గుర్తింపు పొందిన మొదటి దర్శకుడు ఎవరంటే శంకర్ అని చెప్పొచ్చు.. అయన చేసిన భారీ స్థాయిలో ఉండడంతో పాటు భారీ హిట్ లు కూడా కొట్టడంతో అయన కి పాన్ ఇండియా మార్కెట్ ఇదివరకే ఏర్పడింది.. రెండు మూడేళ్లకు సినిమా తీసిన ఆ క్యాస్టింగ్, ఆ స్టోరీ, ఆ ప్రత్యేకతలు ఏ సినిమాలో ఉండవని చెప్పాలి. భారీ ఆలోచ‌న‌లు, భారీ బడ్జెట్ లూ, పెద్ద హీరోలూ శంకర్ స్టైల్.. మొన్నటివరకు ప్రతిఒక్క హీరో శంకర్ తో సినిమా చేయాలనీ చూసేవారు.. కానీ ఐ సినిమా తర్వాత శంకర్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది..

విక్రమ్ హీరో గా చేసిన ఐ సినిమా పెద్ద డిజాస్టర్.. సినిమా కథ పరంగా బాగానే ఉన్నా, నేపథ్యం, స్క్రీన్ ప్లే విషయంలో సినిమా ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. సరే ఐ పోతే పోయింది అనుకోవచ్చు. కానీ ఆ తరువాత చేసిన రోబో 2 మాత్రం శంకర్ ఇమేజ్ ని మరింత దిగజార్చింది. ఇప్పుడు `భార‌తీయుడు 2` ప‌నిలో ఉన్నాడు శంక‌ర్‌. కమల్ హాసన్ నటిస్తున్న ఈ సినిమా కూడా భారీస్థాయిలో తెరకెక్కుతుంది.. ఈ సినిమా కు కొన్ని ఆటంకాలు ఎదురైనా అవన్నీ ఎదుర్కొని ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ నేపథ్యంలో శంక‌ర్ ఓ తెలుగు సినిమా చేస్తున్న‌ట్టు.. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న‌ట్టు ఓ గాసిప్ చ‌క్క‌ర్లు కొడుతోంది. అది ఎలా పుట్టిందో, అందులో నిజాలెంతో తెలీదు గానీ, టాలీవుడ్ ని షేక్ చేసే వార్తే అది. కానీ.. ఈ కాంబో అయ్యే ప‌నేనా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. దీనికి తోడు శంకర్ సినిమాలు ఎన్ని సంవత్సరాలు పడతాయో అందరికి తెలిసిందే.. `భార‌తీయుడు 2` ఎప్పుడో మొద‌లెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ స‌గం సినిమా కూడా పూర్త‌వ్వ‌లేదు. అదెప్పుడు అవుతుందో తెలీదు. ఇలాంటి సమయంలో శంకర్ తో వీరు సినిమా అంటే అవుతుందా అనేది డౌటే.. శంక‌ర్ తెలుగులో సినిమా చేయ‌డానికి ఎప్పుడూ దృష్టి పెట్ట‌లేదు. చిరంజీవి అంత‌టి వాడే… `నాతో ఓ సినిమా చేయ్‌` అని ఆఫర్ ఇచ్చినా శంక‌ర్ ప‌ట్టించుకోలేదు. మ‌హేష్ తో శంక‌ర్ ఓ సినిమా చేస్తాడ‌ని ఇది వ‌ర‌కు వార్త‌లొచ్చాయి. చాలా ఏళ్లు మ‌హేష్ – శంక‌ర్ సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ.. అది కాస్త మ‌రుగున ప‌డిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: