జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్న చమ్మక్ చంద్ర మెగా బ్రదర్ నాగబాబుతో జబర్దస్త్ నుండి జీ తెలుగు అదిరింది షోకి షిఫ్ట్ అయ్యాడు. జబర్దస్త్ డైరక్టర్స్ నితిన్, భరత్ లు బయటకు రావడం వారికి అండగా ఉండేందుకు నాగబాబు కూడా జబర్దస్త్ ఎగ్జిట్ అవడం.. ఆ తర్వాత చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వారు బయటకు రావడం జరిగింది. కొన్నాళ్లు అదిరింది.. మరికొన్నాళ్లు బొమ్మ అదిరిందిగా నడిపించిన ఆ షో ఈమధ్య కొన్ని వారాలుగా రావట్లేదు. షోని పూర్తిగా ఆపేశారా లేక కాన్సెప్ట్ మార్చి వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర సూపర్ స్కిట్స్ వేశాడు. ఇప్పుడు అందులో చెప్పుకునే స్టార్ కమెడియన్స్ తో ఈక్వల్ గా చమ్మక్ చంద్ర ఉన్నాడు. అయితే జీ తెలుగు, అదిరింది టీం నుండి చమ్మక్ చంద్ర మళ్లీ తిరిగి జబర్దస్త్ కు వచ్చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. షో నడిస్తే అందులో చేసే అవకాశం ఉంది కాని షో సరిగా నడవకపోవడంతో బొమ్మ అదిరిందికి చమ్మక్ చంద్ర గుడ్ బై చెప్పేస్తున్నాడని తెలుస్తుంది.

అక్కడ ఎగ్జిట్ అవడం ఓకే ఇక్కడ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది డౌట్ అంటున్నారు. ఒకసారి జబర్దస్త్ ను కాదని వెళ్లాడు కాబట్టి దాదాపు చమ్మక్ చంద్రకు జబర్దస్త్ లో నో ఎంట్రీ బోర్డ్ చూపిస్తారు. అలా కాకుండా జబర్దస్త్ మీద ఉన్న నెగటివ్ మార్క్ తొలగించుకునేలా చమ్మక్ చంద్రకు జబర్దస్త్ లో ఛాన్స్ ఇస్తే మాత్రం మళ్లీ చమ్మక్ చంద్ర తన ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంది. జీ తెలుగులో ఎందుకు షో ఆగిందో వివరాలు తెలియదు కాని బొమ్మ అదిరిందికి అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ రావట్లేదు కాని ఖర్చు మాత్రం భారీగా అవుతుందని ఇన్నర్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: