టాలీవుడ్ మాత్రమే కాదు, దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి డౌట్లూ అవసరం లేదు. ఎందుకంటే అపజయమే ఎరుగని రాజమౌళి చెక్కుతున్న తాజా శిల్పం ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. పైగా బాహుబలి మూవీ తరువాత వస్తున్న సినిమా ఇది.

దాంతో ఆర్.ఆర్.ఆర్ మూవీ మీద అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ 2018 దసరా వేళ మొదలైంది. ఇపుడు ఆ సినిమాను 2021 దసరాకు రిలీజ్ చేద్దామనుకుంటున్నారని టాక్. ఈ మూవీని అక్టోబర్ 8న రిలీజ్ చేస్తారు అంటూ ప్రచారం అయితే సాగుతోంది అఫీషియల్ గా కాదు కానీ అదే డేట్ ఫిక్స్ చేశారు అని మాత్రం అంటున్నారు.

ఈ ఏడాది దసరా అక్టోబర్ 15న పడింది. దానికి వారం ముందు సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్లు కుమ్మేస్తుంది అని చిత్ర యూనిట్ భావిస్తున్నారుట. పైగా ఆ సీజన్ బాగా కలసివస్తుదని కూడా నమ్ముతున్నారుట. ఇక ఆర్.ఆర్.ఆర్ మూవీ బడ్జెట్ ఇప్పటికే పెరిగిపోయింది. పైగా ఒక పది నెలల పాటు ఏ విధమైన షూటింగ్ లేకపోవడం వల్ల కూడా బడ్జెట్ మీద పెను ప్రభావం చూపించింది అంటున్నారు. వీటిని అన్నీ దృష్టిలో పెట్టుకుంటే దసరా కంటే మంచి సీజన్ ఉండదు అని అంటున్నారు. అయితే  పాన్ ఇండియా లెవెల్ లో  దాదాపుగా నాలుగు వందల కోట్ల హెవీ బడ్జెట్ తో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ విషయంలో బ్లాక్ బస్టర్ కావాలంటే మాత్రం సమ్మర్ రిలీజే బెటర్ అని మరో మాట కూడా ఉంది. కానీ అప్పటికి సినిమా పూర్తి కాదు కాబట్టి దసరాకే ఆర్.ఆర్.ఆర్ పండుగ అంటున్నారు. చూడాలి మరి ఈ డేట్ కన్ ఫర్మ్ అవుతుందో లేదో...



మరింత సమాచారం తెలుసుకోండి: