ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తో కొనసాగుతున్నారు మాచిరాజు ప్రదీప్. వాస్తవానికి కెరీర్ బిగింగ్ లో కొన్నీ షో లకు వ్యాఖ్యాతగా పనిచేసిన ప్రదీప్ ఆపై కొంచెం టచ్ లో ఉంటె చెపుతాను, స్టార్ మహిళ, ప్రదీప్ పెళ్లిచూపులు షోల ద్వారా ఆడియన్స్ నుండి విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు. ముఖ్యంగా ప్రదీప్ కి యువత తో పాటు అమ్మాయిల్లో కూడా భారీ క్రేజ్ ఉంది.

ఇక అతడు పలు రియాలిటీ షోల్లో కూడా అక్కడక్కడా దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక ఇటీవల మధ్యలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ప్రదీప్, ప్రస్తుతం హీరోగా చేస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. మున్నా ధూళిపూడి దర్శకత్వంలో ఎస్వీ బాబు నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ శ్రోతలను ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులోని నీలి నీలి ఆకాశం సాంగ్ అయితే ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుని ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

ప్రదీప్ కి జోడీగా అమృత అయ్యర్ నటిస్తున్న ఈ మూవీ మంచి లవ్ కమ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షుకులని ఆకట్టుకునే విధంగా తెరకెక్కినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న 'వా వా మేరె బావ' అనే వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. ఆ సాంగ్ లో బుల్లితెర ప్రముఖ యాంకర్లయిన రష్మీ, అనసూయ, శ్రీముఖి లతో కలిసి ప్రదీప్ ఆడిపాడడం గమనించవచ్చు. ఇప్పటికే ఆ సాంగ్ 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని దక్కించుకుని మంచి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మొత్తంగా ఈ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో రేపు రిలీజ్ కానున్న తమ సినిమాకు మంచి హైప్ వచ్చిందని, అలానే తప్పకుండా మూవీ అందరినీ అలరిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: