సల్మాన్ ఖాన్ కూడా ఆర్.నారాయణ మూర్తిలా బాధపడుతున్నాడు. ఇన్నాళ్లు సోలో లైఫే సో బెటర్ అనుకున్న సల్మాన్ ఇప్పుడు పెళ్లి చేసుకోలేదని ఫీలవుతున్నాడు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుండేదని పబ్లిక్‌గానే చెప్పాడు.

సల్మాన్ ఖాన్‌ లైఫ్‌లో చాలా లవ్‌స్టోరీస్ ఉన్నాయి గానీ, పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఐశ్వర్యారాయ్, కత్రీనా కైఫ్‌ లాంటి బ్యూటీస్‌ చాలామందితో ప్రేమలో పడ్డాడు. కానీ వీళ్లలో ఎవరూ సోల్‌మేట్ కాలేకపోయారు. ఇక ఈ  హర్ట్‌బ్రేక్స్‌తో టోటల్‌గా పెళ్లినే దూరంగా పెట్టాడు సల్మాన్ ఖాన్. ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నాడు.

సల్మాన్‌ ఖాన్‌ హిందీ బిగ్‌బాస్-14ని హోస్ట్ చేశాడు. రీసెంట్‌గానే ఈ సీజన్ పూర్తయ్యింది. ఇక ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌లోనే పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశాడు సల్మాన్. ఫైనల్‌ ఎపిసోడ్‌లో డాన్స్‌ పెర్ఫామ్ చేసిన చిన్నపిల్లాడితో మాట్లాడుతూ కరెక్ట్ వయసులో పెళ్లి జరిగి ఉంటే నాకు ఒక మనవడు ఉండేవాడని కామెంట్స్‌ చేశాడు.

టాలీవుడ్‌ బ్రహ్మచారి ఆర్.నారాయణమూర్తి కూడా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోలేదని బాధపడ్డాడు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని చెప్పాడు. ఇప్పుడు సల్మాన్‌ ఖాన్ కూడా కరెక్ట్ వయసులో పెళ్లి చేసుకుని ఉంటే మనవడిని ఎత్తుకునే వాడనని కామెంట్స్‌ చేశాడు. దీంతో భాయిజాన్‌కి పెళ్లిపై మనసుమళ్లిందనే మాటలు మొదలయ్యాయి.

సల్మాన్ ఖాన్ వయసు ఇప్పుడు 55 ఏళ్లు. మరో అయిదేళ్లలో సీనియర్‌ సిటిజన్ కోటాలో చేరతాడు. మరి ఈ వయసులో సల్మాన్‌ పెళ్లి చేసుకుంటాడా అంటే, రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఒప్పుకుంటే పెళ్లి పెద్ద మేటర్ కాదని కొంతమంది, పెళ్లి చేసుకునే వాడైతే ఎప్పుడో చేసుకునేవాడు. సో సల్మాన్‌ లైఫ్‌లాంగ్ బ్రహ్మచారిగానే ఉంటాడని మరికొంతమంది వాదిస్తున్నారు. మరి సల్మాన్ మనసులో ఏముందో? మొత్తానికి పెళ్లి గురించి సల్మాన్ ఖాన్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో చర్చకు తరలేపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: