ఈమధ్య కాలంలో హీరోయిన్ లలో వరలక్ష్మీ శరత్ కుమార్ కి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాలో వరలక్ష్మీ కి మంచి పాత్ర లు పడడంతో పాటు ఆయా సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ దృష్టి ఆమెపై పడింది.. రవితేజ నటించిన క్రాక్ సినిమా ఏలెవెల్లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..అందుకు కారణం వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్ర కూడా ఓ కారణం..  ఆ సినిమా లో ఆమె నటన ఒకప్పటి సూర్యకాంతం ని గుర్తు చేసింది అంటున్నారు..

అలాగే ఆమె నటించిన నాంది సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.  ఇప్పటిదాకా కామెడీ సినిమాలు చేస్తూ అలరించిన నరేష్జోనర్ లోచేసి మంచి హిట్ కొట్టాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ని సతీష్‌ వేగేశ్ననిర్మించగా ఇప్పటికీ ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇందులో లాయర్ ఆద్యగా కనిపించిన వరలక్ష్మీ.. తనదైన శైలి యాక్టింగ్‌తో మెప్పించింది. ముఖ్యంగా హీరోను కాపాడే పాత్రను అద్భుతంగా పోషించింది.‘క్రాక్', ‘నాంది' సినిమాల తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్‌కు తెలుగులో మంచి పేరు వచ్చింది. నటన పరంగా ఆకట్టుకోవడంతో పాటు లక్కీ చార్మ్‌గా మారిందామె. దీంతో ఈ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ డేట్స్ కోసం తెలుగు ఫిల్మ్ మేకర్లు క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మీ శరత్ కుమార్.. అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంతకం చేసిందని టాక్.

బన్నీ - కొరటాల కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. యువసుధ బ్యానర్, GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందనుంది. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న లేడీ పొలిటీషియన్‌గా వరలక్ష్మీ నటిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఈ పాత్ర ద్వారా తనలోని మరో యాంగిల్‌ను చూపించేందుకు ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన వరలక్ష్మీ.. తెలుగులోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు అల్లు అర్జున్‌  తో సినిమా చేసి ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి మరీ..

మరింత సమాచారం తెలుసుకోండి: