ఎన్నో అంచనాలు మధ్య, వచ్చిన ఉప్పెన సినిమా పెద్ద హిట్ కొట్టింది. టాలీవుడ్ లో ఏ హీరో కి దక్కని ఆదరణ వైష్ణవ్ కి దక్కింది..  ప్రేక్షకులు, మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను అయితే వైష్ణవ్ అందుకున్నాడు. ఏ ఇండస్ట్రీ లో ఇలాంటి ఎంట్రీ ఏ హీరోకి దక్కలేదనే చెప్పాలి..  తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు. ఏ డెబ్యూ హీరో కి సాధ్యం కానీ కలెక్షన్లను వైష్ణవ్ సాధించాడు. మొదటి సినిమా తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించాడంటే ఫ్యూచర్ లో పెద్ద హీరోలకు పోటీ అవడం ఖాయం అని తెలుస్తుంది..

ముఖ్యంగా తన నటన తో వైష్ణవ్ మెగా ఫ్యాన్స్ నే కాకుండా నార్మల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు.. ఎక్స్ ప్రెషన్ లో వేరియేషన్స్ చూపించి వైష్ణవ్ అందరి వద్ద మార్కులు కొట్టేశాడు. అంతేకాకుండా వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై ముందునుంచి మంచి అంచనాలు ఉన్నాయి..ఇకపోతే ఈ సినిమా లోని హీరోయిన్ గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి.. తొలి సినిమా నే అయినా కృతి శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది..ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన తెలుగు సినిమాల్లోనూ ఉప్పెన ఓ రిక్డార్ క్రియేట్ చేసింద‌ని లేటెస్ట్ స‌మాచారం. ఉప్పెన సినిమాకు రు.49 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. 2017లో విడుద‌లైన నేను లోక‌ల్ సినిమాకు రు.35 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి.

2015లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన టెంప‌ర్ కూడా ఫిబ్ర‌వరిలోనే విడుద‌లైంది. టెంప‌ర్ సినిమాకు రు.44.4కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. అలాగే 2013లో విడుద‌లైన ప్ర‌భాస్ మిర్చి సినిమా రు.48.5 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది. ఈ లెక్క‌న చూస్తే ఫిబ్ర‌వ‌రిలో నెల‌లో విడుద‌లై భారీ క‌లెక్ష‌న్స్ సాధించిన స్టార్ హీరోలైన ప్ర‌భాస్, ఎన్టీఆర్ సినిమాల‌కు కూడా ఉప్పెన క‌లెక్ష‌న్స ప‌రంగా క్రాస్ చేసేసింది. త‌మ మెగా క్యాంప్ హీరో తొలి సినిమాతోనే ఇలా రికార్డులు క్రియేట్ చేయ‌డంతో మెగా ఫ్యాన్స్ సంబ‌రాల‌కు హ‌ద్దే లేకుండా పోయింది. మా వైష్ణ‌వ్ తేజ్ తోపు అని సంబ‌ర‌ప‌డుతున్నారు. మ‌రో రెండు వ‌రుస హిట్ సినిమాలు ప‌డితే ఇక వైష్ణ‌వ్ తేజ్ స్టార్ హీరోల లిస్టులో చేర‌డం ప‌క్కా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మ‌రి వైష్ణ‌వ్ తేజ్ ఫ్యాన్స్ ఆశ‌ల‌ను నిల‌బెడ‌తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: