సాధారణంగా సినిమా అవకాశాలు తక్కువైన సినీ సెలబ్రిటీలు అందరూ కూడా.. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యక్షం అవుతున్నారూ  అన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఊహించని విధంగా క్రేజ్  సంపాదించుకుని ఇక బయటికి వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ..  దూసుకుపోతున్నారు. ఇక ఇటీవలే తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా కంటెస్టెంట్స్ అందరూ బయటికి వచ్చిన తర్వాత ఎంతో సక్సెస్ ఫుల్ గా కెరియర్ లీడ్  చేస్తున్నారు అనే విషయం తెలిసిందే వరుస  ఆఫర్లను అందుకుంటూ బిజీ అయిపోతున్నారు.



 అయితే ఇప్పుడు వరకు బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా వెళ్లిన  వారు అందరూ కూడా బిజీ అయిపోయారు కానీ బిగ్ బాస్ విన్నర్  అభిజిత్  మాత్రం ఇప్పటివరకు ఒక్క అవకాశాన్ని కూడా దక్కించుకోలేక పోవడం గమనార్హం. ఈ క్రమంలోనే పలుమార్లు మీడియా కూడా ఈ విషయాన్ని అభిజిత్ ని అడిగింది.  ఇక ఈ విషయంపై సరైన సమాధానం చెప్పకుండా సమాధానం దాటవేశాడు అభిజిత్. అంతేకాదు అభిజిత్ దగ్గరికి కొన్ని కథలు వినిపించడానికి దర్శకులు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేస్తున్నాడటా .



 ఈ క్రమంలోనే అభిజిత్ అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే ఇప్పుడు అభిమానులందరికీ కిక్  ఇచ్చే ఒక వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ నాగార్జున తో డీల్ కుదుర్చుకున్నాడు అన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై మూడు సినిమాలు చేసేందుకు అభిజిత్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనికోసం సైన్ కూడా చేశాడట అభిజిత్. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటు అభిమానులు అందరూ ఖుషి  అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: