మనం థియేటర్ లలో గమనిస్తూ ఉంటాము. థియేటర్ లలో సినిమా టైటిల్ పడకముందు హీరో టైటిల్ వేస్తారు. హీరో పేరుకి ముందు బిరుదుని యాడ్ చేసి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టైటిల్ వేస్తారు. తమ అభిమాన హీరో టైటిల్ చూడగానే ఫ్యాన్స్ విజిల్స్ తో రెచ్చిపోతారు. ఇక ఓ హీరో ఎన్ని హిట్లు కొట్టినా, నటుడిగా ఎంత ప్రూవ్ చేసుకున్నా.. అతను స్టార్ హీరో అయ్యాక మాత్రం అతని పేరు ముందు ఇలా ఎదో ఒక బిరుదు యాడ్ అవుతూ ఉండటం కామన్. అటు తరువాత ఆ హీరో పేరుని సంబోధించే ముందు ఆ బిరుదుని యాడ్ చేస్తూ ఉంటారు. ప్రేక్షకులు అలాగే ఆ హీరోల అభిమానులు కూడా అలానే పిలుస్తూ వుంటారు. అయితే ఆ హీరోకి అప్పటివరకూ ఉన్న హిట్ల కంటే.. ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ పడితే కనుక  ఇంకా పెద్ద బిరుదు లభిస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ టాలీవుడ్లో చాలా మంది హీరోల బిరుదులు మారాయి. మరి ఆ హీరోలు ఎవరు? మొదట వాళ్ళు సంపాదించుకున్న బిరుదు ఏంటి? ఆ తరువాత వాళ్లకు లభించిన బిరుదు ఏంటి? అది ఏ సినిమాలతో? అనే ఆసక్తికరమైన వివరాలు మీ కోసం చూడండి...

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణ కి వున్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లోనే ఈయన ఇండస్ట్రీ కి కొత్త టెక్నాలజీలని పరిచయం చెయ్యడమే కాకుండా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి భారీ స్థాయిలో చాలా ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నారు.ఈయన కెరీర్ ప్రారంభంలో 'నటశేఖర' అనే బిరుదుని సంపాదించుకున్నాడు.అయితే.. మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న తరువాత 'సూపర్ స్టార్' అనే బిరుదు ఇతనికి లభించింది. 'సింహాసనం' సినిమా నుండీ ఈయన సూపర్ స్టార్ కృష్ణగా కొనసాగుతున్నారు.ఇక మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పింది చిరంజీవి. ఆయన డ్యాన్సులు, ఫైట్లతో అప్పటి ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసారు. అందుకే మొదట ఈయన పేరుకి ముందు "డైనమిక్ హీరో" అనే బిరుదు యాడ్ అయ్యింది. ఆ తర్వాత 'సుప్రీమ్ హీరో' అనే బిరుదుని సంపాదించుకున్నారు. అటు తరువాత అంటే 'మరణ మృదంగం' సినిమా నుండీ ఇతని పేరుకి ముందు 'మెగాస్టార్' అనే బిరుదు యాడ్ అయ్యింది. ఇప్పటికీ ఆయన మెగాస్టార్ గానే కొనసాగుతున్నారు.


ఇక మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ కి వచ్చి తన తండ్రి లాగానే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.మొదట ఈయనకి 'ప్రిన్స్' అనే బిరుదు లభించింది. అయితే 'పోకిరి' రికార్డులు బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ అయిన తరువాత ఈయన 'సూపర్ స్టార్' అయ్యాడు.అప్పట్నుంచి ఇప్పటిదాకా తిరుగులేని సూపర్ స్టార్ గా భారీ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు.ఇక నందమూరి వంశం పుత్ర రత్నం ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మొదట 'యంగ్ టైగర్' అనే బిరుదు ఎన్టీఆర్ కు ఉండేది. అయితే 'శక్తి' సినిమాతో 'ఎ1 స్టార్' బిరుదు యాడ్ అయ్యింది. కాని ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పటికీ 'యంగ్ టైగర్' ఎన్టీఆర్ గానే కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: