వెంకటేష్ గారు ప్రస్తుతం వరుస సినిమాలని ఒప్పుకుంటు బిజిగా గడుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం విడుదలయ్యే ఆయన 3 సినిమాలు కూడా ఖచ్చితంగా హిట్ అవుతాయి అని ఆయన నమ్మకంగా ఉన్నారట. ఆయనకి ఇంత నమ్మాకం ఎందుకంటే ఆయన మొదటి చేస్తున్న సినిమా ఎఫ్ 3 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఎఫ్2 సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అని ఆయన నమ్మకం. అలాగే రెండో సినిమా నారప్ప , తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకి రీమేక్ కాబట్టి ఈ సినిమా తెలుగులో భారీ హిట్ అవుతుంది అని ఆయన నమ్మకం.

ఇక చాలా సంవత్సరాల క్రితం వచ్చిన మలయాళం దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని చాలా భాషల్లో అదే పేరుతో రీమేక్ చేశారు.  తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాని రీమేక్ చేసి మంచి సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాకి చాలా సంవత్సరాల తర్వాత సీక్వెల్ వచ్చింది అదే దృశ్యం2. ఈ సినిమాలో కూడా మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో కనిపించారు.  ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడంతో చాలా మంది ఈ సినిమాని ఇప్పటికే చేసేసారు. ఈ సినిమా కి మంచి టాక్ రావడంతో అందరూ అమెజాన్ ప్రైమ్ లో చూసారు.

ఇక ఈ తెలుగు సినిమా దృశ్యం 2 షూటింగ్ పూజ ఈ మద్యనే మొదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర తప్ప అన్ని మలయాళం సినిమాలోని పాత్రలు ఉంటాయి. ఈ సినిమా కూడా మొదటి సినిమాలాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే  ఆగాల్సిందే. ఇక ఈ సినిమాని కూడా ఒరిజినల్ సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా మూడు క్రేజీ సినిమాలని వెంకీ లైన్ లో పెట్టి వాటి మీద బాగా నమ్మకంగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: