కరోనా సెకండ్ వేవ్ దేశంలో విస్తీర్ణంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మరణాల రేటు రెట్టింపవుతోంది. ముఖ్యంగా గా ఈ రెండు  తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి దారుణంగా ఉంది. మొదటి దశ తో పోల్చుకుంటే రెండవ దశ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. అయితే కొంతమంది ప్రజలకు   సరైన వైద్యం అందక, సదుపాయాలు అందక  చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో ప్రజలకు సహాయం అందించేందుకు సెలబ్రిటీలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. కొందరు కరోనా బాధితులకు సహాయం చేయటం కోసం ఆర్థిక సహాయం అందిస్తుండగా, మరికొంత మంది వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సోను సూద్ కూడా కరోనా వారి కోసం ఎంతో సహాయం చేస్తున్నాడు, అంతేకాకుండా మొన్న బాలకృష్ణ కూడా తన నియోజకవర్గానికి రూ. 25 లక్షలు విలువైన కరోనా కిట్లను పంపిణీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.


తాజాగా కరోనా బాధితుల కోసం సహాయం అందించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకు వచ్చారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచి సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా తన దత్తత తీసుకున్న "బుర్రిపాలెం", "సిద్దాపురం"గ్రామ ప్రజలకు ఆయన మరోసారి అండగా నిలిచారు. అక్కడ  వైద్య సౌకర్యాలతోపాటు కరోనా వ్యాక్సిన్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంపై అక్కడ అధికారులతో చర్చిస్తున్నాడు.


ఈ విధంగా చేయడం వల్ల మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా ముందుకు వస్తారని మనం భావించవచ్చు.  ఇక సినిమా విషయానికొస్తే మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం డైరెక్టర్ తో రూపొందుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఇందులో కథానాయిక కీర్తి సురేష్ నటించబోతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ మొత్తం నిలిచిపోయింది. మే 31 వ తేదీన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాలను  ప్రకటించే అవకాశం ఉందట. ఇక ఇటీవల తాను నటించబోతున్న సర్కారు వారి పాట కు సంబంధించిన అన్ని పనులను త్వరలోనే కంప్లీట్ చేస్తామని చిత్ర బృందం యూనిట్ తెలిపింది..


మరింత సమాచారం తెలుసుకోండి: