టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే హార్డ్ వర్క్ అంటారు ఇతర నటీనటులు. తన అభిమానులను అలరించేందుకు బన్నీ కూడా అదే తరహాలో ప్రతి సినిమాకి భారీగా కష్టపడతాడు. సినిమాలో చేసే ప్రతి సీన్ కూడా పక్కాగా అందరినీ ఆకట్టుకునేలా రావాలని చూస్తాడు. అందుకోసం బన్నీ ఎంత కష్టమైనా చేసేందుకు రెడీ అవుతాడు. ఆ డెడికేషనే బన్నీని స్టైలిష్ స్టార్‌గా చేసింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా బన్నీ తన పాత్ర కోసం, ప్రతి సన్నివేశంలో నాచురాలిటీ కోసం తెగ కష్ట పడేవాడు. దాంతో అతడి యాక్టింగ్, స్టైల్, డాన్స్‌కు ఎందరో వీరాభిమానులు అయ్యారు. బన్నీ సినిమా అంటేనే భారీ అంచనాలు పెట్టుకుంటారు.
 

అలాంటి బన్నీ పాన్ ఇండియా రేంజ్ కోసం చేస్తున్న సినిమా అంటే ఆ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉంటాయో చెప్పాలంటే మాటలు సరిపోవు, దానికి తోడు ఆ సినిమాను డైరెక్ట్ చేస్తుంది సుకుమార్. ఈ రెండు  చాలు సినిమా భారీ హిట్ అందుకోవడానికి. వీరి కాంబోలో పుష్ప ప్రారంభం అయినప్పటి నుంచే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై వచ్చే ప్రతి వార్త కూడా ఓ సంచలనం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు చూపుతున్న ఆసక్తి, ఆదరణ బన్నీని మరింత ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా కోసం బన్నీ డెడికేషన్‌ మామూలుగా పెరగలేదు. ఎంతలా పెరిగిందంటే ఒక్క సీన్ కోసం రాత్రంతా అడవిలోనే ఉండిపోయాడట.



ఈ సినిమాలో కాలవలో తెప్ప మీద నడుస్తూ వచ్చే సీన్ ఉందట. ఆ సీన్‌ను చీకట్లో చేయాలని సుకుమార్ అన్నాడట. అంతే చీకటి పడితే చేద్దామని, అప్పుడే సీన్ నాచురల్‌గా వస్తుందని, ఆ ఒక్క సీన్ కోసం బన్నీ అడవిలోనే ఉన్నాడట.ఆ రాత్రి మొత్తం అడవిలోనే గడిపి సీన్ పూర్తి చేసుకొని వచ్చాడట. సినిమా కోసం ఇంత డెడికేషన్ చూపించాడన్న వార్త వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇక ఆ సీన్ చూస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: