రాజమౌళి ‘బాహుబలి’ తీసేంతవరకు అత్యంత భారీ సినిమాలకు చిరునామాగా దర్శకుడు శంకర్ కొనసాగుతూ ఉండేవాడు. అయితే ‘బాహుబలి’ తరువాత పరిస్థితులు తారుమారు అయి శంకర్ స్థానాన్ని రాజమౌళి ఆక్రమించాడు. దీనికితోడు శంకర్ తీసిన భారీ సినిమాలు అన్నీ గత కొంత కాలంగా వరస పరాజయాలు ఎదుర్కుంటూ ఉండటంతో నేషనల్ మార్కెట్ లో శంకర్ ఇమేజ్ పూర్తిగా తగ్గి పోయింది.


ఇలాంటి పరిస్థితులలో తిరిగి తన హవాను కొనసాగిద్దామని శంకర్ కమలహాసన్ తో ‘ఇండియన్ 2’ ప్రారంభించిన ఆమూవీ మధ్యలోనే ఆగిపోయింది. దీనితో శంకర్ తన పద్ధతి మార్చుకుని ఒక యంగ్ హీరోతో మూవీ చేయాలని ఆలోచన రావడంతో రామ్ చరణ్ శంకర్మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ అయింది.


అయితే వాస్తవానికి ఈ మూవీ కథ అంతా ఫైనల్ అయినప్పటికీ ఈ మూవీ ఎప్పటి నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది అన్న విషయం శంకర్ కు కూడ క్లారిటీ లేదు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు శంకర్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పెద్ద సమస్యగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఇంకా మూడు నెలల షూటింగ్ పెండింగ్ లో ఉంది అంటున్నారు.


కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చినా ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా చాల నెలలు పట్టే ఆస్కారం ఉంది. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వచ్చే సంవత్సరం సమ్మర్ కు మాత్రమే అన్న అంచనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి అయి విడుదల కాకుండా చరణ్ శంకర్ సినిమా వైపు వచ్చే ఆస్కారం లేదు. ఈ లోపున మళ్ళీ చరణ్ ఆలోచనలు మారిపోతే ఈ మూవీ ప్రాజెక్ట్ శాస్వితంగా అటక ఎక్కే ఆస్కారం ఉంది అని శంకర్ భయపడుతున్నట్లు టాక్. ఒకప్పుడు టాప్ హీరోలు అంతా శంకర్ వైపు చూస్తే ఇప్పుడు శంకర్ టాప్ హీరోల వైపు చూడవలసిన పరిస్థితి ఏర్పడటం సంచలనం..  




మరింత సమాచారం తెలుసుకోండి: